IND vs SL: వైభవ్ సూర్యవంశీ విఫలం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ.. ఆ జోరును అంతర్జాతీయ వేదికపై కొనసాగించలేకపోయాడు. భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లిన 15 ఏళ్ల వైభవ్ దారుణంగా విఫలమయ్యాడు.
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి. శ్రీలంక బౌలర్ మహమ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో సహాన్ అరచ్చిగేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మరో ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(2) సైతం తీవ్రంగా నిరాశపర్చాడు. కరుణ రత్నే బౌలింగ్‌లో ప్రభ్ సిమ్రాన్ సింగ్.. సమరవిక్రమకు క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత్ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, ప్రియాన్స్ ఆర్య జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. క్రీజులో సెట్ అయిన ప్రియాన్ష్ ఆర్య అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు.
కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ముందుకునడిపిస్తున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్.. శతకం దిశగా సాగుతున్నాడు. శ్రీలంక బౌలర్లలో చమిక కరుణరత్నే, మహమ్మద్ షిరాజ్ తలో వికెట్ తీసారు. వైభవ్ సూర్యవంశీ వైఫల్యం సోషల్ మీడియా వేదికగా హాట్‌టాపిక్‌గా మారింది.
ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కాలంటే భారత్-ఏ తరఫున సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అఫ్గానిస్థాన్-ఏ, శ్రీలంక-ఏ, భారత్-ఏ మధ్య జరుగుతున్న ఈ ట్రై వన్డే సిరీస్‌లో భారత్ ఇంకా నాలుగు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌ల తర్వాత టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి. వైభవ్ సూర్యవంశీకి మరో నాలుగు అవకాశాలు ఉన్నాయి. వాటిలో బ్యాట్ ఝులిపించాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications