ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను గురువారం ప్రకటించాయి. అందరూ ఊహించినట్లుగా కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు వేలంలోకి వచ్చారు.
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, అరంగేట్ర ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ గరిష్టంగా ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. కనిష్టంగా పంజాబ్ కింగ్స్ ఇద్దర్ని మాత్రమే అట్టిపెట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ముగ్గుర్ని రిటైన్ చేసుకోగా.. ముంబై, చెన్నై, లక్నో, గుజరాత్ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. రిషభ్ పంత్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్.. నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకుంది.

ప్రతీ జట్టు పర్స్ వాల్యూను బీసీసీఐ రూ. 120 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ దగ్గర రూ. 110.5 కోట్ల పర్స్ మనీ ఉంది. ఇద్దర్ని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆ జట్టు రిటెన్షన్ కోసం రూ. 9.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వేలంలో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు భారీ సొమ్మును దగ్గర ఉంచుకుంది. కనిష్టంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 41 కోట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 45 కోట్ల పర్స్ మనీ మిగిలి ఉంది.
జట్ల వారిగా ఫ్రాంచైజీల వద్ద మిగిలిన పర్స్ వాల్యూ, ఆర్‌టీఎమ్ కార్డ్స్
1. చెన్నై సూపర్ కింగ్స్-రూ. 55 కోట్లు (ఒక ఆర్‌టీఎమ్ కార్డ్)
2. ముంబై ఇండియన్స్-రూ. 45 కోట్లు((ఒక ఆర్‌టీఎమ్ కార్డ్- అనామక ఆటగాడి కోసం మాత్రమే)
3. కేకేఆర్-రూ. 51 కోట్లు (నో ఆర్‌టీఎమ్)
4. రాజస్థాన్ రాయల్స్-రూ. 41 కోట్లు(నోఆర్‌టీఎమ్)
5.సన్‌రైజర్స్ హైదరాబాద్-రూ. 45 కోట్లు(ఒక ఆర్‌టీఎమ్ కార్డ్- అనామక ఆటగాడి కోసం మాత్రమే)
6.గుజరాత్ టైటాన్స్-రూ. 69 కోట్లు( ఒక ఆర్‌టీఎమ్ కార్డ్)
7.ఆర్‌సీబీ-రూ. 83 కోట్లు(3 ఆర్‌టీఎమ్ కార్డ్స్)
8.ఢిల్లీ క్యాపిటల్స్-రూ.73 కోట్లు(2 ఆర్‌టీఎమ్ కార్డ్స్)
9. పంజాబ్ కింగ్స్-రూ. 110.5 కోట్లు(4 ఆర్‌టీఎమ్ కార్డ్స్)
10. లక్నో సూపర్ జెయింట్స్-రూ. 69 కోట్లు(1 ఆర్‌టీఎమ్ కార్డ్)