Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2020: ప్లే ఆఫ్స్ షెడ్యూల్.. వేదికలు.. మ్యాచ్‌ల టైమింగ్స్

IPL Playoffs Schedule 2020: Qualified Teams List, Dates, Format, Venue, Qualifier and Eliminator Time Table
IPL 2020 : Playoffs & Final Match Schedule || Oneindia Telugu

దుబాయ్: కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సక్సెస్‌పుల్‌గా ప్రారంభమై తుది దశకు చేరుకుంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో 56 మ్యాచ్‌ల లీగ్ దశ పూర్తయింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లతో గెలిచిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో మూడో స్థానం చేరి సగర్వంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అంతకుముందు టేబుల్ టాపర్‌గా ముంబై, సెకండ్ ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, నాలుగో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టోర్నీలో ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

ప్లే ఆఫ్స్ షెడ్యూల్
క్వాలిఫయర్-1: పాయింట్స్ టేబుల్లో టాప్-2 స్థానాల్లో నిలిచిన టీమ్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో మళ్లీ ఆడే అవకాశం ఉంటుంది. టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో నవంబర్5న (గురువారం) దుబాయ్ వేదికగా అమీతుమీ తేల్చుకోనుంది.

ఎలిమినేటర్: పాయింట్స్ టేబుల్లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఓడిన టీమ్ క్వాలిఫయర్-2 ఆడుతుంది. మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. నాలుగో స్థానంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరును నవంబర్ 6(శుక్రవారం)న అబుదాబి వేదికగా ఢీకొట్టబోతుంది.

క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు.. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8(ఆదివారం) అబుదాబి వేదికగా జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది.

ఫైనల్: క్వాలిఫయర్ 1, 2లో గెలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 10(మంగళవారం) దుబాయ్ వేదికగా జరగుతుంది.

Story first published: Wednesday, November 4, 2020, 9:41 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+