
నలుగురు మాత్రమే
ఐపీఎల్ 2022 సీజన్ కోసం డిసెంబర్ నెలలో భారీ వేలం జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంపై బీసీసీఐ ఓ స్పష్టతను ఇచ్చింది. 2022 సీజన్ వేలం ముందు గరిష్ఠంగా నలుగురిని మాత్రమే ఓ ప్రాంచైజీ అట్టిపెట్టుకోవచ్చు. అయితే ఇందులో కూడా బీసీసీఐ కొన్ని పరిమితులను పెట్టింది. ఓ ప్రాంచైజీ ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడిని రీటెయిన్ తీసుకోవచ్చు.. లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. ఆటగాళ్లను రీటెయిన్ చేసుకున్నందుకు వారికి చెల్లించే ధరలను కూడా బీసీసీఐ నిర్ణయించింది.

కేన్, రషీద్
బీసీసీఐ నిబంధలను ప్రకారం.. ఐపీఎల్ 2022 సీజన్ వేలం ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) నలుగురు ఆటగాళ్లను మాత్రమే రీటెయిన్ చేసుకోవాలి. దీంతో జట్టులో ఎవరుంటారనే ఆతృత అభిమానుల్లో నెలకొంది. ఎస్‌ఆర్‌హెచ్ కచ్చితంగా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికే ప్రయత్నిస్తుంది.
ఎందుకంటే కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్ ముగ్గురూ జట్టుకు కీలక ప్లేయర్స్. విదేశీ కోటాలో ఎస్‌ఆర్‌హెచ్ సారథిగా కేన్ మామ కచ్చితంగా ఉంటాడు. ఇక ఒక స్థానం కోసం వార్నర్, రషీద్ మధ్య పోటీ నెలకొంటుంది. ఐపీఎల్ 2021 మధ్యలో కెప్టెన్సీ నుంచి వార్నర్‌ను తప్పించడంతో.. జట్టులో ఉండే అవకాశం రషీద్‌కే ఎక్కువగా ఉంది.

భువీ, నట్టూ
ఇక స్వదేశీ ఆటగాళ్ల కోటాలో ఇద్దరు భారత స్టార్ బౌలర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంచుకునే అవకాశం ఉంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఈ ఏడాది ఆరంభంలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన టీ నటరాజన్‌ను రీటెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే వారిద్దరూ ఆరంభ, డెత్ ఓవర్ల స్పెసలిస్టులు.
తమ కోటా నాలుగు ఓవర్లలో వికెట్లు తీయడమే కాకుండా.. పరుగులు కూడా నియంత్రించగలరు. ఇదే జరిగితే.. ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్, అభిషేక్ శర్మ, మహ్మద్ నబీ, జాసన్ హోల్డర్‌లకు నిరాశ తప్పదు. ఇక బ్యాటింగ్ విభాగంలో మనీష్ పాండే, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, జానీ బెయిర్స్టో, జేసన్ రాయ్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌కు షాక్ తగలనుంది.

అండర్-19 నుంచే జట్టు పగ్గాలు
కేన్ విలియమ్సన్ ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మన్. అండర్-19 నుంచే జట్టు పగ్గాలు అందుకుని సక్సెస్ అయ్యాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లానే మైదానంలో చాలా కూల్‌గా ఉంటాడు. ఇక జట్టు ఏ స్థితిలో ఉన్నా.. తనదైన బ్యాటింగ్‌తో విజయాలు అందిస్తాడు. తన జాతీయ జట్టు అఫ్గానిస్థాన్ కంటే.. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడడంతోనే రషీద్ ఖాన్ పాపులర్ అయ్యాడు.
తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌ను సైతం బోల్తాకొట్టించగలడు. తన పదునైన బంతులతో వికెట్లు పడగొడుతూ.. పరుగులను నియంత్రించగలడు. భువీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత బౌలర్లలో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల ఒకే ఒక్కడు. నట్టూ ఇప్పుడిప్పుడే జట్టులోకి వచ్చి అద్భుతంగా రాణిస్తున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
దేశీయ ఆటగాళ్లు: భువనేశ్వర్‌కుమార్, షాబాజ్ నదీమ్, నటరాజన్, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా, కేదార్ జాదవ్, సందీప్‌శర్మ, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, అభిషేక్‌శర్మ, ఖలీల్ అహ్మద్, బాసిల్ థంపి, ప్రియం గార్గ్, శ్రీవత్స గోస్వామి, సిద్ధార్థ్ కౌల్, జగదీశ సుచిత్, విరాట్ సింగ్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, జేసన్ హోల్డర్, జేసన్ రాయ్, ముజిబుర్ రహమాన్.


Click it and Unblock the Notifications

దేవుడా.. అది వైడ్ బాల్ కాదా?! ఇది నిజంగా చెత్త అంపైరింగే! డివిల్లియర్స్, స్టెయిన్ ఏమన్నారంటే? (వీడియో)










