For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కంగ్రాట్స్ వార్నర్.. నో డౌట్! వేలంలో ఈసారి నీకు పైసలే పైసల్: సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL Mega Auctio 2022: SRH Team Congrulates David Warner Before Auction

హైదరాబాద్: యాషెస్ సిరీస్‌లో అదరగొట్టిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు తన పాత ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభినందనలు తెలిపింది. తిరిగి ఫామ్ అందుకున్నందుకు సంతోషంగా ఉందని, సిరీస్ విజయాన్ని ఆనందించాలని సూచించింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారీ ధర పలుకుతాడని, ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని పేర్కొంది. డేవిడ్ వార్నర్ చేసిన ఓ ట్వీట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇలా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయాన్ని అభినందిస్తూ ఆ జట్టు మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ ట్వీట్ చేశాడు. ఎన్నో రోజులుగా ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్‌లో బొక్కలున్నప్పటికీ ఇద్దరు సూపర్ స్టార్లతో నెట్టుకొచ్చిందని, ఇప్పుడు ఆ జట్టు బలహీనత బయటపడిందని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించిందని కొనియాడాడు. ఇక ఈ ట్వీట్‌కు ఓ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమాని స్పందిస్తూ.. 'ఈ సారి వేలం ఎలా ఉండబోతుంది? సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసొస్తుందా?'అని ప్రశ్నించాడు. దీనికి టామ్ మూడీ బదులిస్తూ తమ సాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పాడు. డేవిడ్ వార్నర్ మాత్రం 'నాకు డౌటే'అంటూ సెటైర్లు పేల్చాడు.

కంగ్రాట్స్ డేవీ..

కంగ్రాట్స్ డేవీ..

ఇక తమ మాజీ కెప్టెన్‌ కామెంట్ చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అతనికి అభినందనలు తెలుపుతూ.. వచ్చే సీజన్ వేలం వార్నర్‌కు కలిసి వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. 'యాషెస్ సిరీస్ గెలిచినందుకు కంగ్రాట్స్ డేవీ.. నువ్వు మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లున్నావ్. ఈ విజయాన్ని ఆస్వాదించు. అంతేకాకుండా ఈ సారి వేలంలో నీకు అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాం'అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత వార్నర్‌ ఉద్దేశించి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పందించడం ఇదే తొలిసారి. దాంతో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. వార్నర్ కోసం టామ్ మూడీ నేతృత్వంలోని సన్‌రైజర్స్ మళ్లీ ప్రయత్నిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2014 సీజన్ నుంచి..

2014 సీజన్ నుంచి..

ఐపీఎల్ 2014 సీజన్‌ వేలంలో రూ. 5.5 కోట్లకి డేవిడ్ వార్నర్‌ని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత ఏడాదే కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. కెప్టెన్‌గా టీమ్‌ని ముందుండి నడిపించిన వార్నర్ ఐపీఎల్ 2016 సీజన్‌లో హైదరాబాద్‌ను విజేతగా నిలిపాడు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ భారంగా భావించింది. సీజన్ మధ్యలో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. కనీసం తుది జట్టులో కూడా చోటివ్వలేదు. దాంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ని వార్నర్ వీడటం లాంఛనంగా మారిపోయింది.

 ఆర్‌సీబీలోకి..

ఆర్‌సీబీలోకి..

2014 నుంచి హైదరాబాద్ టీమ్‌కి ఆడిన వార్నర్.. 95 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 142.59 స్ట్రైక్‌రేట్‌తో 4014 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను మూడు సార్లు ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. కెప్టెన్‌గానూ డేవిడ్ వార్నర్‌ ఫెయిలయ్యాడు. దాంతో.. సీజన్ మధ్యలోనే అతడ్ని అవమానకరరీతిలో కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ తర్వాత జట్టు నుంచి కూడా వేటు వేశారు.

అయినప్పటికీ.. స్టాండ్స్‌లో కూర్చుని హైదరాబాద్ టీమ్‌ని వార్నర్ ప్రోత్సహించాడు. ఇప్పటికీ తనని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గల కారణం తెలియదని వార్నర్ చెప్తున్నాడు. తనకు సన్‌రైజర్స్‌‌తోనే ఉండాలనుందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టులోకి వార్నర్ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది

Story first published: Tuesday, December 28, 2021, 21:05 [IST]
Other articles published on Dec 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+