IPL Media Rights: ఈపీఎల్‌ను వెనక్కునెట్టి రికార్డు సృష్టించిన ఐపీఎల్.. ప్రపంచంలోనే రెండో లీగ్‌గా..

న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సంచలనాలకు కేంద్ర బింధువుగా మారింది. గత 15 ఏళ్ల కాలంలో ప్రపంచంలో మేటి లీగ్‌లకు ధీటుగా నిలిచి అత్యంత ప్రజాధరణ పొందిన లీగ్‌గా అవతరించిన ధనాధన్ లీగ్.. తాజాగా మీడియా హక్కుల పరంగా మరో రికార్డును బద్దలు కొట్టింది. విశ్వవ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన ప్రముఖ ఫుట్‌బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వెనక్కునెట్టిన ఐపీఎల్.. విలువ పరంగా ప్రపంచంలో టాప్-2 లీగ్‌గా నిలిచింది.

రెట్టింపు అయిన ఐపీఎల్ విలువ..
ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఐపీఎల్.. ఈపీఎల్‌ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది. ఈపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు (11 యూఎస్ మిలియన్ డాలర్లు) కాగా, ఐపీఎల్‌లో అది రూ. 107.5 కోట్లకు (13.4 యూఎస్ మిలియన్ డాలర్లు) చేరుకుంది. గతంలో ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉండేది. తాజాగా జరిగిన మీడియా హక్కుల వేలం ద్వారా ఐపీఎల్ విలువ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది.

టాప్‌లో ఎన్‌ఎఫ్‌ఎల్..
టీవీ ప్రసారాలు (రూ. 57.5 కోట్లు), డిజిటల్ (రూ. 50 కోట్లు) హక్కుల ద్వారా ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ విలువ రూ. 107.5 కోట్లకు చేరింది. ప్రస్తుతం మ్యాచ్ విలువ పరంగా అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ అయిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) ఐపీఎల్ కంటే ముందుంది. ఎన్ఎఫ్ఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 133 కోట్లు (17 యూఎస్ మిలియన్ డాలర్లు)గా ఉంది.

బీసీసీఐకి జాక్ పాట్..
ఇదిలా ఉంటే, గత మూడు రోజులుగా ముంబైలో జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ ఖజానాలో రూ. 48,390 కోట్లు చేరాయి. ఫలితంగా క్రీడా చరిత్రలో అతిపెద్ద ప్రసార ఒప్పందాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్‌కు సంబంధించి టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్ (రూ.23,575 కోట్లు) దక్కించుకోగా.. ఇండియా డిజిటిల్ హక్కులను రిలయన్స్ భాగస్వామిగా ఉన్న వయాకామ్18 రూ.20,500 కోట్లకు చేజిక్కించుకుంది. నాన్-ఎక్స్‌క్లూజివ్ ప్యాకేజీ 'సి'ని కూడా వయాకామ్18 సొంతం చేసుకుంది. వచ్చే అయిదేళ్ల కాలంలో మొత్తం 410 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. వయాకామ్18 బోధి ట్రీ, లుపా సిస్టమ్స్‌తో కన్సార్షియమ్‌గా ఏర్పడి ఈ వేలంలో పాల్గొంది. ప్యాకేజీ 'డి' (విదేశీ టీవీ, డిజిటల్ హక్కులు)ని వయాకామ్18, టైమ్స్ ఇంటర్నెట్ పంచుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications