Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Media Rights ఈవేలం నేటి నుంచే.. బరిలో బడా కంపెనీలు!

IPL media rights: Companies pad up for big cricket battle today

న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మీడియా రైట్స్ వేలానికి సర్వం సిద్దమైంది. రాబోయే ఐదేండ్ల కాలానికి ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే వాళ్లు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఆదివారం నుంచి జరిగే వేలంలో ప్రపంచ మేటి సంస్థలు పోటీ పడుతున్నాయి. నాలుగు ప్యాకేజీల్లో(ఏ,బీ,సీ,డీ) ఉన్న 2023-2027 సైకిల్‌‌ మీడియా రైట్స్‌‌ ప్రారంభ ధరను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ. 32, 440 కోట్లుగా నిర్ణయించింది. తాజా వేలంలో( ఈ-ఆక్షన్‌‌) కనీసం 45 వేల కోట్ల నుంచి 60 వేల కోట్ల వరకూ మీడియా హక్కులు అమ్ముడయ్యే అవకాశం ఉందని బోర్డు, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 మూడు రెట్లు పెరిగే చాన్స్..

మూడు రెట్లు పెరిగే చాన్స్..

2017లో జరిగిన వేలంలో స్టార్‌‌ ఇండియా అప్పటికి రికార్డు స్థాయిలో 16,347.50 కోట్లకు ఐదేళ్ల రైట్స్‌‌ (2018-22) కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఎల్‌‌లో టీమ్స్‌‌, మ్యాచ్‌‌ల సంఖ్య పెరగడం, ఆటపై ఆసక్తి రెట్టింపు అవడంతో పాటు స్పోర్ట్స్‌‌ బిజినెస్‌‌పై ప్రపంచంలోనే పెద్ద పెద్ద సంస్థలు ఆసక్తి చూపెట్టడంతో ఐపీఎల్‌‌ మీడియా రైట్స్‌‌ ధర క్రితం సారితో పోలిస్తే రెండు, మూడు రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీడియా రైట్స్‌‌ కోసం తొలిసారి ఈ-వేలం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మొదలయ్యే వేలంలో పోటీదారులు ఆన్‌‌లైన్‌‌ పోర్టల్‌‌లో బిడ్స్‌‌ వేస్తారు. చివరికి అత్యధిక బిడ్‌‌ వేసిన వారికి హక్కులు దక్కుతాయి. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తవకపోతే సోమవారం కూడా కొనసాగుతుంది.

అమెజాన్, గూగుల్, జీ ఔట్..

అమెజాన్, గూగుల్, జీ ఔట్..

మీడియా రైట్స్‌‌ రేసు నుంచి అమెజాన్‌‌, గూగుల్‌‌ తప్పుకోగా, తాజాగా జీ ఎంటర్‌‌టైనమెంట్‌‌ కూడా వాటి సరసన చేరినట్లు తెలుస్తోంది. సాధారణ టెక్నికల్‌‌ బిడ్‌‌ దాఖలు చేసిన జీ.. ప్యాకేజ్‌‌-ఎ కోసం ఎలాంటి బిడ్‌‌ వేయలేదని సమాచారం. దీంతో రిలయన్స్‌‌ వయకామ్‌‌-18, సోనీ, డిస్నీ స్టార్‌‌ పోటీలో ముందున్నాయి. ప్రస్తుతానికి పది కంపెనీలు రేస్‌‌లో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం ఈ మూడింటి మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. టైమ్స్‌‌ ఇంటర్నేట్‌‌ (డిజిటల్‌‌), రిలయన్స్‌‌ జియో (డిజిటల్‌‌), సూపర్‌‌ స్పోర్ట్‌‌ (ఇంటర్నేషనల్‌‌ రైట్స్‌‌) కూడా బరిలో నిలిచాయి.

రిలయన్స్‌కే చాన్స్..

రిలయన్స్‌కే చాన్స్..

'నాలుగు సంస్థలు బిడ్డింగ్‌ తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆఖరి బిడ్లు దాఖలు చేశాక విజేత ఎవరో తెలుస్తుంది. తుది జాబితాలో నిలిచిన ఆ నాలుగు సంస్థలు.. వయాకామ్‌18, డిస్నీ స్టార్‌, సోనీ, జీ'అని ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ రేసు నుంచి ఇప్పటికే అమెజాన్‌, గూగుల్ తప్పుకుంది.

ఈ నేపథ్యంలో పోటీ ప్రధానంగా డిస్నీ స్టార్‌, వయాకామ్‌18 మధ్య ఉండే ఆస్కారముంది. వయాకామ్‌18 యాజమాన్య సంస్థ రిలయన్స్‌.. ఈ సారి మీడియా ప్రసార హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించనుందని సమాచారం. చివరకు ఆ సంస్థకే హక్కులు దక్కిన ఆశ్చర్యపోనవరం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Story first published: Sunday, June 12, 2022, 10:29 [IST]
Other articles published on Jun 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+