IPL Media Rights నుంచి అమెజాన్, గూగుల్ ఔట్.. రిలయన్స్‌తో పోటీ తట్టుకోలేక విత్ డ్రా! ఈవేలం ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మీడియా రైట్స్‌పై ఫోకస్ పెట్టింది. వచ్చే ఐదేళ్లు(2023-28) మీడియా రైట్స్ ద్వారా రూ.50 వేల కోట్లు రాబట్టాలని బోర్డు అంచనా వేస్తోంది. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మీడియా రైట్స్ కోసం తొలిసారి ఈ వేలం నిర్వహించనున్నారు. జూన్ 12న ఈ ఆక్షన్ జరగనుంది. ఈ ప్రక్రియ రెండు మూడు రోజులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఆరంభంలో ఇన్విటేషన్ టెండర్ ప్రక్రియ ప్రారంభించిన బీసీసీఐ.. బిడ్ దాఖలు చేయడానికి నాన్ రిఫెండబుల్ ఫీగా రూ.25 లక్షల వసూలు చేసింది. పన్నులు అదనం. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఈ వేలంలో పాల్గొనేందుకు ఒక్కో బిడ్డరు అన్ని కలుపుకోని సుమారు రూ.29.5 లక్షలు చెల్లించనట్లు తెలుస్తోంది.

ఈ వేలం ఎప్పుడంటే..?
జూన్ 12న ఈ ఆక్షన్ ప్రారంభంకానుంది.
పోటీలో ఉన్న బిడ్డర్స్..
డిస్నీ హాట్ స్టార్, సోనీ, స్పోర్ట్స్ 18, జీ ఎంటర్‌టైన్‌మెంట్, యాపిల్, స్కై స్పోర్ట్స్ యూకే మరియు సౌతాఫ్రికా సూపర్ స్పోర్ట్.

రేసు నుంచి అమెజాన్ ఔట్..
ఐపీఎల్ మీడియా రైట్స్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగిన అమెజాన్ చివరి నిమిషంలో తప్పుకుంది. తమ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ప్రైమ్ వీడియో వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేయాలనుకున్న అమెజాన్.. డిస్నీ స్టార్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికి చెందిన స్పోర్ట్స్ 18లతో ఉన్న తీవ్ర పోటీ నేపథ్యంలో తప్పుకోవడమే ఉత్తమమని భావించింది. గూగుల్ కూడా రేసు నుంచి తప్పుకుంది.

నాలుగు విభాగాలుగా మీడియా రైట్స్..
వచ్చే ఐదేళ్లకు ఐపీఎల్ మీడియా రైట్స్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ నాలుగు విభాగాలకు సపరేట్‌గా బిడ్ చేసుకోవచ్చు.
1. భారత్‌లో టెలివిజన్ రైట్స్
2. డిజిటల్ రైట్స్
3. 18 మ్యాచ్‌లకు సంబంధించిన నాన్ ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ రైట్స్. ఇందులో సీజన్ ఓపెనర్‌తో పాటు నాలుగు ప్లే ఆఫ్స్, వీకెండ్ డబుల్ హెడర్‌లోని ఈవ్‌నింగ్ మ్యాచ్‌లు
4 భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసే హక్కులు


గతడేది ధర ఎంతంటే..?
ఐపీఎల్ 2018 నుంచి 2022 వరకు మీడియా రైట్స్‌ను స్టార్ స్పోర్ట్స్ 16,347.50 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ సారి మీడియా రైట్స్ ద్వారా రూ.50 వేల కోట్లు రాబట్టాలనుకుంటుంది. ఐపీఎల్ 15 సూపర్ హిట్ కావడంతో మీడియా రైట్స్‌కు భారీ ధర పలికే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ ఎలారా సెక్యూరిటీస్ స్పష్టం చేసింది. తద్వారా దాదాపు రూ.60 వేల కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేసింది. ప్రతీ మ్యాచ్‌కు ఐపీఎల్ డిజిటల్ బేస్‌ప్రైజ్ రూ.33 కోట్లుగా ఉంది. వేలంలో ఇది రూ.65 నుంచి రూ.66 కోట్ల మధ్య పలుకుతుందని అంచనా వేసింది. ఇక ప్రతీ మ్యాచ్‌కు ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ బేస్ ప్రైజ్ రూ.49 కోట్లు కాగా, రూ.40 నుంచి 50 శాతం పెరుగుదల ఉండనుంది. దీంతో రూ.65 నుంచి 70 కోట్లు ఆదాయం రావొచ్చని ఎలారా చెబుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications