చివరి బంతి వరకు: ఐపీఎల్‌లో అద్భుతం, RR vs SRH మ్యాచ్ హైలెట్స్

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో (వైడ్లు, నో బాల్స్ రూపంలో) ఒక ఎక్స్‌ట్రా పరుగు కూడా రాకపోవడం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్‌లో ఇది ఓ అరుదైన సందర్భమే. అయితే 20 ఓవర్ ఆఖరి బంతికి బై రూపంలో అదనపు పరుగుగా వచ్చింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ బౌలర్లు ఆద్యంతం తమ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. రాజస్థాన్ బౌలర్లు పరుగులు నియంత్రించడంతో పాటు ఎంతో క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ వేశారు. ఒక్క ఎక్స్‌ట్రా కూడా ఇవ్వకుండా నియంత్రణతో కూడిన బౌలింగ్ వేశారు.
అయితే ఆఖరి ఓవర్‌లో చివరి బంతికి ఎక్స్‌ట్రా రావడంతో ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క అదనపు పరుగు వచ్చినట్లయ్యింది. అది కూడా బై రూపంలో రావడంతో అసలు ఎక్స్‌ట్రా లేకుండా ఇన్నింగ్స్ ముగుస్తుందనుకున్న అభిమానికి నిరాశే ఎదురైంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో 20 ఓవర్ల బౌలింగ్‌లో ఒకే ఒక్క ఎక్స్‌ట్రా రావడం ఇదే తొలిసారి.

రాజస్థాన్‌పై హైదరాబాద్ ఘన విజయం
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. హైదరాబాద్ తక్కువ స్కోరు చేసినప్పటికీ, బౌలర్లు మరోసారి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (43 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలెక్స్ హేల్స్ (39 బంతుల్లో 45; 4 ఫోర్లు) రాణించారు.

సిక్సర్లతో వేగం పెంచిన కేవ్ విలియమ్సన్
ఆరంభంలోనే ధావన్ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన తర్వాత, మూడో ఓవర్ నుంచి 14వ (13.3) ఓవర్ వరకూ పది ఓవర్ల పాటు సన్‌రైజర్స్ బ్యాటింగ్ జోరు కొనసాగింది. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న అలెక్స్ హేల్స్ బౌండరీలతో విరుచుకపడగా, మరోవైపు కెప్టెన్ కేన్ విలియమ్సన్ చూడచక్కని సిక్సర్లతో వేగం పెంచాడు. ఉనాద్కట్ వేసిన 12వ ఓవర్లో కేన్ రెచ్చిపోయాడు. 4, 6, 4, 2, 4, 1లతో ఏకంగా 21 పరుగులు రాబట్టాడు.

32 బంతుల్లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ
దీంతో 32 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో మరో సిక్సర్ బాదాడు. ఇలా సాఫీగా... భారీ స్కోరు దిశగా సాగిపోతున్న ఈ ఇన్నింగ్స్ ఈ ఇద్దరు పెవిలియన్ చేరడంతో కీలక భాగస్వామ్యానికి తెరపడింది. రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించాక... 14వ ఓవర్లో కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో మొదట హేల్స్, ఇష్ సోధి వేసిన మరుసటి ఓవర్లో విలియమ్సన్ ఔటయ్యారు.

డెత్ ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 42 పరుగులు
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబ్ (6), యూసుఫ్ పఠాన్ (2), రషీద్ ఖాన్ (1) తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరారు. దీంతో కీలకమైన డెత్ ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ కేవలం 42 పరుగులే చేయగలిగింది. గౌతమ్ 2, ఉనాద్కట్, ఇష్ సోధి చెరో వికెట్ తీశారు. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (3/26) కట్టడి చేశాడు.

విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రహానే (53 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), సంజూ శామ్సన్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినప్పటికీ జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు తీశాడు. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications