Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఫైనల్ 2018: తేదీ, వేదిక, తలపడే జట్లు, సమయం తదితర వివరాలు

 IPL Final 2018: Date, Venue, Teams, Time, Tickets, TV Channels List, Live Streaming

హైదరాబాద్: 49 రోజుల పాటు మొత్తం 59 మ్యాచ్‌లు... చివరి ఓవర్ వరకు ఉత్కంఠ... చివరకు రెండు జట్లు ఫైనల్‌కు చేరాయి. ఐపీఎల్ 11వ సీజన్‌లో చోటు చేసుకున్న దృశ్యం ఇది. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో కోల్‌కతాపై 13 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

తద్వారా ఐపీఎల్ 11వ సీజన్‌‌ పైనల్లో పాల్గొనే రెండు జట్లు ఖరారయ్యాయి. టోర్నీలో ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ సీజన్‌లో చెన్నైతో తలపడిన మూడు సార్లు హైదరాబాద్ ఓటమిపాలైనా... తుదిపోరులో అమీ తుమీ తేల్చుకోనుంది.

ఐపీఎల్ ఫైనల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేరడం ఇది రెండోసారి. ఐపీఎల్ 11వ సీజన్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటే అందులో 18 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో కూడా 18 పాయింట్లు ఉన్నప్పటికీ, రన్ రేట్ తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది.

ఇరు జట్లు లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మే 22న ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో 2 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి పాలైంది. దీంతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.


To buy tickets: Click here

TV Channels: StarSports Network (India). For other countries click here.

Live Streaming: Hotstar.com.

Timings: Match Starts at 7 PM (IST). Toss will be held at 6:30 PM (IST).


Closing Ceremony starts at 5:30 PM (IST)


FINAL

May 27 (Sunday) - (7 PM IST) - Mumbai (Wankhede Stadium)

CHENNAI SUPER KINGS 1 Vs SUNRISERS HYDERABAD.


May 28 (Monday) - Reserve Day.

Story first published: Saturday, May 26, 2018, 15:56 [IST]
Other articles published on May 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+