Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లోనే వాడు అత్యంత చెత్త యజమాని: లలిత్ మోదీ

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ గోయెంకా అత్యంత చెత్త యజమాని అని, మాట తప్పిన మూర్ఖుడంటూ మండిపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ రిషభ్ పంత్‌‌ను తప్పించడాన్ని లలిత్ మోదీ తప్పుబట్టాడు.

నిలకడ లేని వక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజీవ్‌ గోయెంకానే అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్‌కాస్ట్‌ ఇంటర్య్వూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'సంజీవ్ గోయెంకాకు ఒక ఫ్రాంచైజీని కొనడం, ఆ జట్టును అర్హత కానీ లేదు. సంజీవ్ గోయెంకా పూర్తిగా బిజినెస్ మైండ్‌సెట్ కలిగిన వ్యక్తి.

IPL Controversy Lalit Modi Slams Sanjiv Goenka Labels Him the Worst IPL Team Owner
Photo Credit: X (twitter)

అతడు తన విద్యుత్ బిజినెస్‌కే పరిమితం కావాల్సింది. అనవసరంగా ఐపీఎల్‌లో ఫ్రాంచైజీని కొని చేతులు కాల్చుకున్నాడు. ఐపీఎల్ రేటింగ్ తగ్గుదలకు సంజీవ్ గోయెంకా కూడా ఓ కారణం. లక్నో జట్టు ప్రతీ సీజన్‌లో పేలవమైన ప్రదర్శననే కనబరుస్తూ వస్తోంది. ఈసారి కూడా ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించడంతో సంజీవ్ గోయెంకా మీమర్స్‌కు దొరికిపోయాడు. ఇప్పుడాయన ఒక మీమ్ కింగ్ మారాడు. గోయెంకాపై వచ్చిన మీమ్స్‌లో అత్యధిక మంది చూసిన మీమ్‌కు నేను రోలెక్స్ వాచీని బహుమతిగా ఇస్తాను'అని లలిత్ మోదీ అన్నారు.

ఇక అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్ గోయెంకా‌పై లలిత్ మోదీ విమర్శలు గుప్పిస్తున్నాడు. ఈ సీజన్‌ ఆరంభంలో లక్నో పరాజయం తర్వాత రిషభ్ పంత్‌ను సంజీవ్ గోయెంకా మందలించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ సమయంలోనూ సంజీవ్ గోయెంకాపై లలిత్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'పంత్‌కు దీర్ఘకాలం అండగా ఉంటానన్న ఆ పెద్ద మనిషి తన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు'అని మండిపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్ వైఫల్యం నేపథ్యంలో సారథ్య బాధ్యతల నుంచి రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తప్పించింది. అతనే స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని ప్రకటించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన లక్నో 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.

Story first published: Tuesday, June 2, 2026, 20:18 [IST]
Other articles published on Jun 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+