For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026 వేలానికి వేళాయే.. పూర్తి వివరాలు!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో అబుదాబి‌లోని ఎతిహాద్ స్టేడియం వేదికగా ఈ మినీ ఆక్షన్‌కు తెరలేవనుంది. ఈసారి 10 జట్లలో గరిష్టంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఇందులో 110 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండగా.. 31 మందికి అవకాశం దక్కనుంది. 10 ఫ్రాంచైజీలు రూ. 237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి.

వేలం టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఏంటంటే..?

భారత కాలమానం ప్రకారం మంగళవారం(డిసెంబర్ 16) మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ రెండు వేదికలను సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సిందే. ప్రత్యేకమైన మొబైల్ రిఛార్జ్ ప్లాన్స్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

ఫ్రాంచైజీల వద్ద ఉన్న డబ్బు ఎంతంటే..?

రిటెన్షన్ ప్రక్రియ తర్వాత కోల్‌కతా నైట్‌నైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు ఉండగా.. అత్యల్పంగా ముంబై ఇండియన్స్ వద్ద రూ.2.75 కోట్లు ఉన్నాయి.

IPL Auction 2026 Timings Live Streaming Details Team Purse Value Available Slots and Top Players List

ఫ్రాంచైజీల వారిగా పర్స్ వాల్యూ

1.కోల్‌కతా నైట్‌రైడర్స్:రూ.64.3 కోట్లు

2. చెన్నై సూపర్ కింగ్స్: రూ. 43.4 కోట్లు

3. సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ.25.5 కోట్లు

4. లక్నో సూపర్ జెయింట్స్: రూ.22.95 కోట్లు

5. ఢిల్లీ క్యాపిటల్స్: రూ.21.8 కోట్లు

6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ.16.4 కోట్లు

7. రాజస్థాన్ రాయల్స్: రూ.16.05 కోట్లు

8. గుజరాత్ టైటాన్స్: రూ.12.9 కోట్లు

9. పంజాబ్ కింగ్స్: రూ.11.5 కోట్లు

10. ముంబై ఇండియన్స్: రూ.2.75 కోట్లు


ఫ్రాంచైజీల వారిగా కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య

1.కోల్‌కతా నైట్‌రైడర్స్: 13

2. చెన్నై సూపర్ కింగ్స్: 9

3. సన్‌రైజర్స్ హైదరాబాద్: 10

4. లక్నో సూపర్ జెయింట్స్: 6

5. ఢిల్లీ క్యాపిటల్స్: 8

6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:8

7. రాజస్థాన్ రాయల్స్: 9

8. గుజరాత్ టైటాన్స్: 5

9. పంజాబ్ కింగ్స్: 4

10. ముంబై ఇండియన్స్: 5

రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ ఆటగాళ్లు ఎవరంటే..?

ఈసారి రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో మొత్తం 45 మంది ఆటగాళ్లు ఉన్నారు. వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జెమీ స్మిత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్, జోష్ ఇంగ్లిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డానియల్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్ వెల్, గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, పతిరణ, తీక్షణ, హసరంగ, షాయ్ హోప్, అల్జరీ జోసఫ్.

Story first published: Monday, December 15, 2025, 12:25 [IST]
Other articles published on Dec 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+