ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కురిపిస్తోంది. ఇప్పటికే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు పేస్ ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్‌లను భారీ ధరకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. మరో టీమిండియా ప్లేయర్‌ను తీసుకుంది. స్టార్ వికెట్ కీపర్ ఇషన్ కిషన్‌ను రూ. 11.25 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.
గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు 105 మ్యాచ్‌లు ఆడిన 135.87 స్ట్రైక్‌రేట్‌తో 2644 పరుగులు చేశాడు. రిటెన్షన్ రూల్స్ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ వేలంలోకి విడుదల చేసింది. దాంతో ఇషాన్ కిషన్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.

అతని కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ పోటీపడ్డాయి. ముందుగా ముంబై, ఢిల్లీ మధ్య పోటీ జరగ్గా.. పంజాబ్ కింగ్స్ మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ కూడా బిడ్ వేయడంతో ఇషాన్ కిషన్ ధర రూ. 10 కోట్ల మార్క్ ధాటింది. ఈ బిడ్డింగ్ చాలా నెమ్మదిగా సాగగా.. చివరకు సన్‌రైజర్స్ రూ. 11.25 కోట్లకు సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2022 మెగావేలంలో ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అదే ధరతో గత సీజన్ వరకు కొనసాగించింది. తాజా వేలంలో అతను భారీ ధర పలుకుతాడని అంతా భావించగా.. తక్కవ ధరకే పరిమితమయ్యాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు ఇషాన్ కిషన్ దూరం కావడంతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడంతో ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఇషాన్ కిషన్‌ను రూ. 11.25 కోట్లకు తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. మహమ్మద్ షమీ కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేసింది. హర్షల్ పటేల్‌ను రూ. 8 కోట్లకు దక్కించుకుంది.
IPL 2025 మెగా వేలం హైలైట్స్
అర్ష్‌దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్‌టీఎమ్)
కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)
జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
రిషభ్ పంత్-రూ. 27 కోట్లు(లక్నో సూపర్ జెయింట్స్)
మహమ్మద్ షమీ-రూ. 10 కోట్లు(SRH)
డేవిడ్ మిల్లర్-రూ. 7.5 కోట్లు(లక్నో సూపర్ జెయంట్స్)
యుజ్వేంద్ర చాహల్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్)
లియామ్ లివింగ్ స్టోన్-రూ. 8.75 కోట్లు(ఆర్‌సీబీ)
కేఎల్ రాహుల్-రూ. 14 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
హ్యారీ బ్రూక్-రూ.6.25 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
దేవదత్ పడిక్కల్-అన్ సోల్డ్
ఎయిడెన్ మార్క్‌రమ్-రూ. 2 కోట్లు(లక్నో)
డేవాన్ కాన్వే- 6.25 కోట్లు (సీఎస్‌కే)
రాహుల్ త్రిపాఠి-రూ. 3.40 కోట్లు(సీఎస్‌కే)
డేవిడ్ వార్నర్-అన్‌సోల్డ్
జేక్ ఫ్రీజర్-మెక్ గుర్క్-రూ. 9 కోట్లు(ఢిల్లీ)
హర్షల్ పటేల్-రూ. 8 కోట్లు(SRH)
రచిన్ రవీంద్ర-రూ. 4 కోట్లు(సీఎస్‌కే)
ఆర్. అశ్విన్-రూ. 9.75 కోట్లు(సీఎస్‌కే)
వెంకటేశ్ అయ్యర్-రూ. 23.75 కోట్లు(కేకేఆర్)
మార్కస్ స్టోయినీస్-రూ. 11 కోట్లు(పంజాబ్ కింగ్స్)
మిచెల్ మార్ష్- రూ. 3.4 కోట్లు(లక్నో)
గ్లేన్ మ్యాక్స్‌వెల్-రూ. 4.20 కోట్లు(పంజాబ్)
క్వింటన్ డికాక్-రూ. 3.60 కోట్లు(కేకేఆర్)
జానీ బెయిర్ స్టో-అన్‌సోల్డ్
ఫిల్ సాల్ట్-11.50 కోట్లు(ఆర్‌సీబీ)
రెహ్మానుల్లా గుర్బాజ్- రూ. 2 కోట్లు(కేకేఆర్)
ఇషాన్ కిషన్- రూ. 11.25 కోట్లు(సన్‌రైజర్స్)
జితేశ్ శర్మ-రూ. 11 కోట్లు(ఆర్‌సీబీ)
జోష్ హజెల్ వుడ్-రూ.12.50 కోట్లు(ఆర్‌సీబీ)
ప్రసిధ్ కృష్ణ-రూ. 9 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
ఆవేశ్ ఖాన్-రూ. 9.75 కోట్లు(లక్నో)
అన్రిచ్ నోర్జ్(రూ. 6.5 కోట్లు)-కేకేఆర్
జోఫ్రా ఆర్ఛర్-రూ. 12.50 కోట్లు(రాజస్థాన్ రాయల్స్)
ఖలీల్ అహ్మద్-రూ. 4.8 కోట్లు(సీఎస్‌కే)