Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అర్ష్‌దీప్ సింగ్‌కు అదిరిపోయే ధర.. SRH‌ చేజారిన స్టార్ పేసర్!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభమైంది. ముందుగా మార్క్యూ ప్లేయర్లను వేలం వేయగా.. అర్ష్‌దీప్ సింగ్‌‌తో ఆక్షన్ ప్రారంభమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని పంజాబ్ కింగ్స్ ఆర్‌టీఎమ్ కార్డ్ సాయంతో రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది.

ముందుగా అర్ష్‌దీప్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ధీటుగా బిడ్ వేసింది. మధ్యలో గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ బిడ్ వేసి అర్ష్‌దీప్ సింగ్ ధరను అమాంతం పెంచేసాయి. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ పోటాపోటీగా తలపడటంతో అతని ధర రూ. 15.75 కోట్లకు చేరింది. ఈ భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్ష్‌దీప్ సింగ్‌ను దక్కించుకోగా.. పంజాబ్ కింగ్స్ ఆర్‌టీఎమ్ కార్డ్‌తో రేసులోకి వచ్చింది.

IPL Auction 2025 PBKS Use RTM On Arshdeep Singh To Get Him To SRH For INR 18Cr

సన్‌రైజర్స్ హైదరాబాద్ వెనక్కి తగ్గకుండా రూ.18 కోట్లకు బిడ్ వేయగా.. పంజాబ్ కింగ్స్ ఆ ధర చెల్లిస్తామని చెప్పి సొంతం చేసుకుంది. దాంతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన భారత పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. గత సీజన్‌లో అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్‌కే ప్రాతినిథ్యం వహించాడు.

IPL 2025 మెగా వేలం హైలైట్స్

అర్ష్‌దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్‌టీఎమ్)

కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)

జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

రిషభ్ పంత్-రూ. 27 కోట్లు(లక్నో సూపర్ జెయింట్స్)

Story first published: Sunday, November 24, 2024, 16:12 [IST]
Other articles published on Nov 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+