Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction 2025: ఇదేందయ్యా అంబానీ.. ఇది ఎప్పుడూ చూడలే!(వీడియో)

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ.. ప్రత్యర్థి జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టేబుల్ దగ్గర వరకు వెళ్లి ఆ జట్టు ఓనర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ ధన్యావాదాలు తెలిపాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట చర్చనీయాంశమైంది.

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ కోసం ఆర్‌సీబీ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించలేదు. దాంతోనే ఆకాశ్ అంబానీ.. ఆర్‌సీబీ ఓనర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున విల్ జాక్స్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయినా ఆ జట్టు అతన్ని తీసుకునేందుకు ఆసక్తి కనబర్చలేదు. అప్పటికే పేస్ ఆల్‌రౌండర్ టీమ్ డేవిడ్‌ను కొనుగోలు చేయడంతో విల్ జాక్స్‌ కోసం ప్రయత్నించలేదు.

IPL Auction 2025 MI Owner Akash Ambani Says Thanks To RCB Management For Not Excercising RTM Card On Will Jacks

రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన విల్ జాక్స్‌ను ముంబై ఇండియన్స్ రూ. 5.20 కోట్లకు దక్కించుకుంది. ఈ ఆటగాడి కోసం ముంబై.. పంజాబ్ కింగ్స్‌తో తీవ్రంగా పోటీపడింది. చివరకు రూ. 5.20 కోట్లకు దక్కించుకుంది. కానీ ఆక్షనీర్ మల్లికా సాగర్.. ఆర్‌సీబీని ఆర్‌టీఎమ్ కార్డ్ వాడుతారా? అని ప్రశ్నించింది. అందుకు వారు లేదని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.

దాంతో విల్ జాక్స్ ముంబైకి సొంతమయ్యాడు. దాంతో తీవ్ర సంతోషానికి గురైన ఆకాశ్ అంబానీ.. వెంటనే ఆర్‌సీబీ టేబుల్ దగ్గరకు వెళ్లి ఆ జట్టు ఓనర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదేందయ్యా అంబానీ.. ఇది ఎప్పుడూ చూడలే! అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో విల్ జాక్స్ 8 మ్యాచ్‌లు ఆడి 175 స్ట్రైక్‌రేట్‌తో 230 పరుగులు చేశాడు. ఒక సెంచరీ కూడా కొట్టాడు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ జట్టు అతన్ని తీసుకునేందుకు ప్రయత్నించలేదు.

Story first published: Monday, November 25, 2024, 20:27 [IST]
Other articles published on Nov 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+