For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం 2025 LIVE: చెన్నై గూటికి తెలుగు తేజం

ఐపీఎల్ మెగా వేలం‌లో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్‌పాట్ కొట్టారు. రిషభ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు ఖర్చు పెట్టింది. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక పలికిన ప్లేయర్‌గా పంత్ నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26.75 కోట్లు వెచ్చించింది.

మెగా ఆక్షన్ తొలి రోజు మొత్తం 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. 72 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 24 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఓవరాల్‌గా ఈ 72 మంది ఆటగాళ్ల కోసం పది ఫ్రాంచైజీలు రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి. అన్ని ఫ్రాంచైజీల్లో పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 10 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. అలాగే అత్యధికంగా ఎక్కువ మొత్తంగా ఖర్చు చేసింది కూడా పంజాబే. రూ. 88 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ -రెండో రోజుకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

IPL Auction 2025 Live Streaming updates on All Teams SRH RCB MI GT LSG KKR CSK  PBKS  RR Players List  Sold  Unsold  Highest Bid  Uncapped Players  Key Highlights in Telugu

Nov 25, 2024, 10:48 pm IST

మొత్తం 126 మంది ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా నిలిచిపోయారు.

Nov 25, 2024, 10:47 pm IST

ముగిసిన ఐపీఎల్ 2025 వేలం

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. మొత్తం 577 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. తొలి రోజు 72 మంది ఆటగాళ్లు అమ్ముడవ్వగా.. రెండో రోజు 110 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.

Nov 25, 2024, 10:43 pm IST

ఆఖరి ప్లేయర్ మోహిత్ రతీని రూ. 30 లక్షలకు తీసుకున్న ఆర్‌సీబీ

Nov 25, 2024, 10:38 pm IST

అర్జున్ టెండూల్కర్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Nov 25, 2024, 9:46 pm IST

సచిన్ కొడుక్కి బిగ్ షాక్

సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను పట్టించుకోని ఫ్రాంచైజీలు

Nov 25, 2024, 9:36 pm IST

అనుకూల్ రాయ్‌ను రూ. 40 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్

Nov 25, 2024, 9:32 pm IST

రూ. 1.50 కోట్లకు రహానేను కొనుగోలు చేసిన కేకేఆర్

Nov 25, 2024, 9:31 pm IST

గ్లేన్ ఫిలిప్స్‌ను రూ. 2 కోట్లకు తీసుకున్న గుజరాత్

Nov 25, 2024, 9:27 pm IST

మరోసారి అన్‌సోల్డ్‌గా నిలిచిన డేవిడ్ వార్నర్

Nov 25, 2024, 9:26 pm IST

ఆర్‌సీబీలోకి దేవదత్ పడిక్కల్

తొలి రోజు అన్‌సోల్డ్‌గా నిలిచిన దేవదత్ పడిక్కల్‌ను ఆర్‌సీబీ రూ. 2 కోట్ల కనీస ధరకు తీసుకుంది.

Nov 25, 2024, 8:40 pm IST

13 ఏళ్ల కుర్రాడికి రూ. 1.1 కోట్లు

వైభవ్ సూర్య వన్షీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అమ్ముడైన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు తీసుకుంది.

Nov 25, 2024, 8:34 pm IST

ఎషాన్ మలింగను రూ.1.20 లక్షలకు తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

Nov 25, 2024, 8:28 pm IST

వైభవ్ సూర్య వన్షిని రూ.కోటీ పది లక్షలకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్

Nov 25, 2024, 8:21 pm IST

సత్యనారయణను రూ. 30 లక్షలకు దక్కించుకున్న ముంబై

Nov 25, 2024, 8:12 pm IST

అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్

Nov 25, 2024, 7:55 pm IST

ప్రిన్స్ యాదవ్‌ను రూ. 30 లక్షలకు తీసుకున్న లక్నో

Nov 25, 2024, 7:52 pm IST

అనికేత్ వర్మను రూ. 30 లక్షలకు తీసుకున్న సన్‌రైజర్స్

Nov 25, 2024, 7:51 pm IST

రాజ్ అంగద్‌ బావాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Nov 25, 2024, 7:48 pm IST

షెమర్ జోసెఫ్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో

Nov 25, 2024, 7:40 pm IST

కమిందు మెండీస్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Nov 25, 2024, 7:36 pm IST

జాకెబ్ బెతెల్‌ను దక్కించుకున్న ఆర్‌సీబీ

Nov 25, 2024, 7:17 pm IST

అమ్ముడుపోని సికిందర్ రాజా

Nov 25, 2024, 7:16 pm IST

అమ్ముడుపోని స్టీవ్ స్మిత్

Nov 25, 2024, 7:14 pm IST

గుర్జప్‌నీత్ సింగ్‌ను రూ. 2.20 కోట్లకు కొన్న సీఎస్‌కే

Nov 25, 2024, 7:14 pm IST

ఆకాశ్ సింగ్‌ను రూ. 30 లక్షలనకు కొనుగోలు చేసిన లక్నో

Nov 25, 2024, 7:14 pm IST

అశ్వాని కుమార్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై

Nov 25, 2024, 7:14 pm IST

యుధ్‌వీర్ సింగ్‌ను రూ. 35 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Nov 25, 2024, 7:14 pm IST

హర్నూర్ పన్నూ‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్

Nov 25, 2024, 6:49 pm IST

అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్

Nov 25, 2024, 6:46 pm IST

జయదేవ్ ఉనాద్కత్‌ను కోటీ రూపాయలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్

Nov 25, 2024, 6:45 pm IST

నవీన్ ఉల్ హక్‌ను పట్టించుకోని ఫ్రాంచైజీలు

Nov 25, 2024, 6:44 pm IST

నువాన్ తుషార‌ను రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Nov 25, 2024, 6:42 pm IST

ఇషాంత్ శర్మను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Nov 25, 2024, 6:41 pm IST

అమ్ముడుపోని ముస్తాఫిజుర్ రెహ్మాన్

Nov 25, 2024, 6:40 pm IST

ఉమ్రాన్ మాలిక్‌‌కు బిగ్ షాక్.. అన్‌సోల్డ్‌గా జమ్మూ ఎక్స్‌ప్రెస్

Nov 25, 2024, 6:39 pm IST

స్పెన్సర్ జాన్సన్‌ను రూ.2.80 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

Nov 25, 2024, 6:38 pm IST

రోమారియో షెఫర్డ్‌ను రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Nov 25, 2024, 6:36 pm IST

సాయి కిషోర్‌ను రూ. 90 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Nov 25, 2024, 6:35 pm IST

అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Nov 25, 2024, 6:35 pm IST

విల్ జాక్స్‌ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Nov 25, 2024, 6:35 pm IST

దీపక్ హుడా రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై

Nov 25, 2024, 6:35 pm IST

టీమ్ డేవిడ్‌ను రూ. 3 కోట్లకు తీసుకున్న ఆర్‌సీబీ

Nov 25, 2024, 6:35 pm IST

అమ్ముడుపోని మోయిన్ అలీ

Nov 25, 2024, 6:35 pm IST

షెహ్‌బాజ్ అహ్మద్‌ను రూ. 2.40 కోట్లకు తీసుకున్న లక్నో

Nov 25, 2024, 6:35 pm IST

షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్‌ను రూ. 2.60 కోట్లకు తీసుకున్న గుజరాత్ టైటాన్స్

Nov 25, 2024, 6:33 pm IST

మనీష్ పాండేను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్

Nov 25, 2024, 6:32 pm IST

అమ్ముడుపోని డేవాల్డ్ బ్రెవిస్, ఫిన్ అలెన్

Nov 25, 2024, 6:15 pm IST

దిగ్వేష్ సింగ్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో

Nov 25, 2024, 6:14 pm IST

ఎమ్ సిద్దార్థ్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో

Nov 25, 2024, 6:14 pm IST

జీషన్ అన్సారీని రూ. 40 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముఖేష్ చౌదరీని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన సీఎస్‌కే

Nov 25, 2024, 6:14 pm IST

గుర్నూర్ సింగ్ బ్రార్‌ను రూ.1.30 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్ స్వప్నిల్ సింగ్‌ను రూ.50 లక్షలకు ఆర్‌టీఎమ్ కార్డ్ కింద తీసుకున్న ఆర్‌సీబీ

Nov 25, 2024, 6:14 pm IST

దర్షన్ నల్కండే‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ హిమ్మత్ సింగ్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Nov 25, 2024, 6:13 pm IST

అన్షుల్ కంబోజ్‌ను రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్‌కే అర్షద్ ఖాన్‌ను రూ. 1.30 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Nov 25, 2024, 6:10 pm IST

గత సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కే ఆడిన షేక్ రషీద్. తెలుగు కుర్రాడిని పట్టించుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్

Nov 25, 2024, 6:08 pm IST

తెలుగు తేజం షేక్ రషీద్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

Nov 25, 2024, 6:07 pm IST

అన్‌క్యాప్‌డ్ బ్యాటర్ శుభ్‌మన్ దుబేను రూ.80 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Nov 25, 2024, 6:06 pm IST

జట్ల వద్ద మిగిలి ఉన్న పర్స్ వాల్యూ

Remaining purse for all teams CSK - Rs. 13.20 crore MI - Rs. 11.05 crore RCB - Rs. 14.15 crore KKR - Rs. 8.55 crore SRH - Rs. 5.15 crore RR - Rs. 6.65 crore PBKS - Rs. 10.90 crore DC - Rs. 3.80 crore GT - Rs. 11.90 crore LSG - Rs. 6.85 crore

Nov 25, 2024, 4:56 pm IST

అకీల్ హోస్సేన్, విసయకాంత్, ఆదిల్ రషీద్ అన్‌సోల్డ్

Nov 25, 2024, 4:55 pm IST

రూ.4.80 కోట్లకు అల్లా గజన్‌ఫర్‌ను కొనుగోలు చేసిన ముంబై

Nov 25, 2024, 4:45 pm IST

అమ్ముడుపోని ముజీబ్ ఉర్ రెహ్మాన్

Nov 25, 2024, 4:45 pm IST

రూ.2 కోట్ల కనీస ధరకు లాకీ ఫెర్గూసన్‌ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Nov 25, 2024, 4:44 pm IST

రూ. కోట్లకు ఆకాశ్‌దీప్‌ను కొనుగోలు చేసిన లక్నో‌సూపర్ జెయింట్స్

Nov 25, 2024, 4:43 pm IST

రూ. 9.25 కోట్ల భారీ ధరకు దీపక్ చాహర్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Nov 25, 2024, 4:32 pm IST

ముఖేష్‌ కుమార్‌ను ఆర్‌టీఎమ్ ద్వారా రూ.8 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Nov 25, 2024, 4:26 pm IST

భువనేశ్వర్ కుమార్‌ను రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Nov 25, 2024, 4:23 pm IST

సౌతాఫ్రికా క్రికెటర్ జెరాల్డ్ కొట్జియ‌ను రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Nov 25, 2024, 4:20 pm IST

తుషార్ దేశ్‌పాండే రూ. 6.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌ కొనుగోలు చేసింది

Nov 25, 2024, 4:17 pm IST

రెండో రోజు మెగా వేలం హైలైట్స్

1. మార్కో జాన్సెన్స్ - రూ. 7కోట్లు(పంజాబ్ కింగ్స్) 2. కృనాల్ పాండ్యా - 5.75కోట్లు(ఆర్‌సీబీ) 3. నితీష్ రాణా - 4.2కోట్లు(రాజస్థాన్ రాయల్స్) 4. వాషింగ్టన్ సుందర్- 3.2కోట్లు(గుజరాత్ టైటాన్స్) 5.జోష్ ఇంగ్లీస్ -రూ. 2.6కోట్లు(పంజాబ్) 6. సామ్ కరణ్ - 2.4కోట్లు(సీఎస్‌కే)

Nov 25, 2024, 4:07 pm IST

అమ్ముడుపోని డోనవా ఫెర్రారీయా

Nov 25, 2024, 4:07 pm IST

అమ్ముడుపోని అలెక్స్ క్యారీ

Nov 25, 2024, 4:07 pm IST

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీస్‌ను రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Nov 25, 2024, 4:06 pm IST

తెలుగు తేజం కేఎస్ భరత్‌కు బిగ్ షాక్

తెలుగు తేజం కేఎస్ భరత్‌కు బిగ్ షాక్ తగిలింది. అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దాంతో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు.

Nov 25, 2024, 4:05 pm IST

ర్యాన్ రికల్టన్‌ను కోటీ రూపాయల అతని బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Nov 25, 2024, 4:04 pm IST

ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో అన్‌సోల్డ్‌గా నిలిచిన షైహోప్

Nov 25, 2024, 4:02 pm IST

రాజస్థాన్‌కు రాణా

రూ.4.2 కోట్లకు నితీశ్ రాణాను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. రాణా కోసం ఆర్సీబీ ప్రయత్నించింది

Nov 25, 2024, 3:57 pm IST

కృనాల్ పాండ్యను ఆర్సీబీ రూ.5.75 కోట్లకు సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆర్‌టీఎమ్‌ను ఉపయోగించలేదు

Nov 25, 2024, 3:52 pm IST

ఆర్‌టీఎమ్‌కు పంజాబ్ నో

సామ్ కరన్‌ను సీఎస్కే రూ.2.40 కోట్లకు దక్కించుకుంది. ఆర్‌టీఎమ్‌ను పంజాబ్ ఉపయోగించలేదు

Nov 25, 2024, 3:50 pm IST

వాషింగ్టన్ సుందర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.3.2 కోట్లకు దక్కించుకుంది. సుందర్ కోసం ఆర్సీబీ ప్రయత్నమే చేయలేదు.

Nov 25, 2024, 3:49 pm IST

మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు

Nov 25, 2024, 3:40 pm IST

ఢిల్లీకి వెళ్లిన ఆర్సీబీ కెప్టెన్

ఆర్సీబీ మాజీ కెప్టెన్ డుప్లెసిస్‌ను రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది

Nov 25, 2024, 3:38 pm IST

రో‌వ్‌మన్ పావెల్‌ను కేకేఆర్ కనీస ధర రూ.1.50 కోట్లకు దక్కించుకుంది

Nov 25, 2024, 3:34 pm IST

కేన్ విలియమ్సన్ అన్‌సోల్డ్

మెగా వేలంలో న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ అమ్ముడుపోలేదు

Nov 25, 2024, 3:29 pm IST

ఇవాళ వేలానికి వచ్చే వారిలో కీలక ఆటగాళ్లు (కనీస ధర)

ఫాఫ్‌ డుప్లెసిస్‌(దక్షిణాఫ్రికా) : రూ. 2 కోట్లు; అజింక్య రహానె (భారత్‌): రూ. 1.5 కోట్లు; కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌) : రూ.2 కోట్లు; సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌) : రూ. 2 కోట్లు; మార్కో యన్‌సన్‌ (దక్షిణాఫ్రికా) : రూ. 1.25 కోట్లు; డారిల్‌ మిచెల్‌ (న్యూజిలాండ్‌) : రూ. 2 కోట్లు; కృనాల్‌ పాండ్యా (భారత్‌) : రూ. 2 కోట్లు; వాషింగ్టన్‌ సుందర్‌ (భారత్‌) : రూ. 2 కోట్లు; శార్దుల్‌ ఠాకూర్‌ (భారత్‌) : రూ. 2 కోట్లు; గ్లెన్‌ ఫిలిప్స్‌(న్యూజిలాండ్‌ ): రూ 2 కోట్లు;

Nov 25, 2024, 3:17 pm IST

ఫ్రాంచైజీల వద్ద మిగిలి ఉన్న మొత్తం (రూ.కోట్లలో)

సీఎస్కే: రూ. 15.6; డిల్లీ క్యాపిటల్స్: రూ. 13.8; గుజరాత్‌ టైటాన్స్‌: 17.5; లక్నో: 14.85; పంజాబ్‌ కింగ్స్‌: 22.50

Nov 25, 2024, 3:01 pm IST

ఆర్సీబీ వద్ద మిగిలిన మొత్తం, ఆర్‌టీఎమ్‌లు

పెట్టిన ఖర్చు: రూ. 89.53 కోట్లు; మిగిలిన డబ్బు: రూ. 30.65 కోట్లు; మిగిలిన ఆర్‌టీఎమ్: 03; కావాల్సిన ప్లేయర్లు: 16 (విదేశీ ఆటగాళ్లు- 05)

Nov 25, 2024, 3:00 pm IST

ఆర్సీబీ కొనుగోలు చేసిన ప్లేయర్లు

హేజిల్‌వుడ్‌ (12.50), ఫిల్‌ సాల్ట్‌ (11.50), జితేశ్‌ (11), లివింగ్‌స్టన్‌ (8.75), రసిక్‌ సలాం (6), సుయాష్‌ (2.60)

Nov 25, 2024, 2:23 pm IST

ఆర్‌టీఎమ్‌తో సొంతం చేసుకున్న ఆటగాళ్లు

అర్షదీప్ సింగ్ (రూ.18 కోట్లు)- పంజాబ్ కింగ్స్; జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (రూ. 9 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్; నమన్ ధిర్ (రూ.5.25 కోట్లు)- ముంబై ఇండియన్స్; రచిన్ రవీంద్ర (రూ.4 కోట్లు)- చెన్నై సూపర్ కింగ్స్.

Nov 25, 2024, 2:06 pm IST

ముంబయి ఇండియన్స్ రిటైన్ ప్లేయర్లు: బుమ్రా (18), సూర్యకుమార్‌ (16.35), హార్దిక్‌ (16.35), రోహిత్‌ (16.30), తిలక్‌ (8) కొనుగోలు చేసిన ఆటగాళ్లు: బౌల్ట్‌ (12.50), నమన్‌ ధీర్‌ (5.25), రాబిన్‌ (రూ.65 లక్షలు), కర్ణ్‌ శర్మ (రూ.50 లక్షలు) పెట్టిన ఖర్చు: రూ. 93.90 కోట్లు మిగిలిన డబ్బు: రూ. 26.10 కోట్లు మిగిలిన ఆర్‌టీఎమ్: 0 కావాల్సిన ప్లేయర్లు: 16 (విదేశీ ఆటగాళ్లు- 07)

Nov 25, 2024, 12:27 pm IST

కేకేర్ పెట్టిన ఖర్చు: రూ. 109.95 కోట్లు; మిగిలిన డబ్బు: రూ. 10.05 కోట్లు; మిగిలిన ఆర్‌టీఎమ్: 0; కావాల్సిన ప్లేయర్లు: 12 (విదేశీ ఆటగాళ్లు- 03)

Nov 25, 2024, 12:26 pm IST

కోల్‌కతా నైట్ రైడర్స్

రిటైన్ ప్లేయర్లు: రింకు (13), వరుణ్‌ (12), నరైన్‌ (12), రసెల్‌ (12), హర్షిత్‌ (4), రమణ్‌దీప్‌ (4); కొనుగోలు చేసిన ఆటగాళ్లు: వెంకటేశ్‌ అయ్యర్‌ (23.75), నోకియా (6.50), డికాక్‌ (3.60), రఘువంశీ (3), గుర్బాజ్‌ (2), వైభవ్‌ (1.80), మయాంక్‌ మార్కండె (రూ.30 లక్షలు)

Nov 25, 2024, 12:01 pm IST

SRH వద్ద ఎంత బడ్జెట్ మిగిలందంటే..

పెట్టిన ఖర్చు: రూ. 114.85 కోట్లు; మిగిలిన డబ్బు: రూ. 5.15 కోట్లు; మిగిలిన ఆర్‌టీఎమ్: 01; కావాల్సిన ప్లేయర్లు: 12 (విదేశీ ఆటగాళ్లు- 04)

Nov 25, 2024, 11:54 am IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌

రిటైన్ ప్లేయర్లు: క్లాసెన్‌ (23), కమిన్స్‌ (18), అభిషేక్‌ (14), హెడ్‌ (14), నితీశ్‌కుమార్‌ (6) కొనుగోలు చేసిన ఆటగాళ్లు: ఇషాన్‌ కిషన్‌ (11.25), షమి (10), హర్షల్‌ (8), అభినవ్‌ (3.20), రాహుల్‌ చాహర్‌ (3.20), జంపా (2.40), సిమర్‌జీత్‌ (1.50), అథర్వ (రూ.30 లక్షలు)

Nov 24, 2024, 11:11 pm IST

ముగిసిన తొలి రోజు వేలం.. 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా 12 మంది ఆటగాళ్లు అమ్ముడుపోలేదు

Nov 24, 2024, 11:07 pm IST

శ్రేయస్ గోపాల్-అన్‌సోల్డ్

Nov 24, 2024, 11:06 pm IST

కుమార్ కార్తీకేయ సింగ్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Nov 24, 2024, 11:05 pm IST

పియూష్ చావ్లాను కొనుగోలు చేసేందుకు ముందుకురాని ఫ్రాంచైజీలు. అమ్ముడుపోని జాబితాలోకి చేరిపోయిన చావ్లా

Nov 24, 2024, 11:03 pm IST

మయాంక్ మార్కండేను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్

Nov 24, 2024, 11:02 pm IST

కర్ణ్ శర్మ‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Nov 24, 2024, 11:01 pm IST

సుయాశ్ శర్మను రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Nov 24, 2024, 10:58 pm IST

సిమర్జీత్ సింగ్‌ను రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్‌కే

Nov 24, 2024, 10:54 pm IST

యశ్ ఠాకూర్‌ను రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Nov 24, 2024, 10:46 pm IST

విజయ్ కుమార్ వైశాఖ్‌ను రూ. 1.80 కోట్లకు కొనగులు చేసిన పంజాబ్ కింగ్స్

Nov 24, 2024, 10:44 pm IST

మోహిత్ శర్మ‌ను రూ.2.2 కోట్లకు తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Nov 24, 2024, 10:40 pm IST

ఆకాశ్ మధ్వాల్‌ను రూ. 1.2 కోట్లకు తీసుకున్న రాజస్థాన్ రాయల్స్

Nov 24, 2024, 10:39 pm IST

రసిక్ దార్‌ను రూ. 6 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Nov 24, 2024, 10:38 pm IST

విష్ణు వినోద్‌ను రూ. 30 లక్షలకు తీసుకున్న కేకేఆర్

Nov 24, 2024, 10:34 pm IST

అనూజ్ రావత్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న గుజరాత్ టైటాన్స్

Nov 24, 2024, 10:33 pm IST

రాబిన్ మింజ్‌‌ను రూ. 65 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Nov 24, 2024, 10:32 pm IST

అషుతోష్ శర్మ‌ను రూ.3.80 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Nov 24, 2024, 10:08 pm IST

మహిపాల్ లోమ్రోర్‌ను రూ. 1.70 కోట్లకు తీసుకున్న గుజరాత్ టైటాన్స్

Nov 24, 2024, 10:05 pm IST

విజయ్ శంకర్‌ను రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్‌కే

Nov 24, 2024, 10:03 pm IST

హర్‌ప్రీత్ బ్రార్‌ను రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Nov 24, 2024, 10:00 pm IST

అబ్దుల్ సమద్‌ను రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Nov 24, 2024, 9:55 pm IST

నమన్‌ ధీర్‌ను రూ. 5.25 కోట్లకు ఆర్‌టీఎమ్ ద్వారా కొనుగోలు చేసింది.

Nov 24, 2024, 9:50 pm IST

సమీర్ రిజ్వీ‌ని రూ.95 లక్షలకు కొనుగోలు చేసిన సీఎస్కే

Nov 24, 2024, 9:48 pm IST

నిషాంత్ సింధును రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Nov 24, 2024, 9:47 pm IST

అభినవ్ మనోహర్‌ను రూ.3.20‌ కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Nov 24, 2024, 9:45 pm IST

అభినవ్ మనోహర్‌ను రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Nov 24, 2024, 9:37 pm IST

కరుణ్ నాయర్‌ను రూ. 50 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Nov 24, 2024, 9:36 pm IST

అంగ్‌క్రిష్ రఘువంశీని రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

Nov 24, 2024, 9:35 pm IST

నెహాల్ వదేరా‌ను రూ.4.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Nov 24, 2024, 9:30 pm IST

అథర్వ టైడ్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Nov 24, 2024, 9:03 pm IST

నూర్ అహ్మద్‌ను రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్‌కే

Nov 24, 2024, 9:02 pm IST

వానిందు హసరంగాను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Nov 24, 2024, 9:02 pm IST

ఆడమ్ జంపాను రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Nov 24, 2024, 9:01 pm IST

రాహుల్ చాహర్‌ను రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Nov 24, 2024, 8:58 pm IST

తీక్షణను రూ. 4.40 కోట్లకు తీసుకున్న రాజస్థాన్ రాయల్స్

Nov 24, 2024, 8:47 pm IST

ట్రెంట్ బౌల్డ్‌ను రూ. 12.75 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Nov 24, 2024, 8:47 pm IST

టీ నటరాజన్‌ను రూ.10.75 కోట్లు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Nov 24, 2024, 8:33 pm IST

ఖలీల్ అహ్మద్‌ను రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్‌కే

Nov 24, 2024, 8:33 pm IST

జోఫ్రా ఆర్ఛర్‌ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

Nov 24, 2024, 8:32 pm IST

అన్రిచ్ నోర్జ్‌ను రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

Nov 24, 2024, 8:31 pm IST

ఆవేశ్ ఖాన్‌ను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో

Nov 24, 2024, 8:30 pm IST

ప్రసిధ్ కృష్ణను రూ. 9 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Nov 24, 2024, 8:30 pm IST

జోష్ హజెల్ వుడ్‌ను .12.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Nov 24, 2024, 8:29 pm IST

జితేశ్ శర్మను రూ. 11 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Nov 24, 2024, 8:13 pm IST

ఇషాన్ కిషన్‌ను రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్

Nov 24, 2024, 7:55 pm IST

రెహ్మానుల్లా గుర్జాజ్‌ను రూ. 2 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్

Nov 24, 2024, 7:47 pm IST

ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఫిల్‌సాల్ట్‌ను రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Nov 24, 2024, 7:41 pm IST

జానీ బెయిర్ స్టోను కొనోగులు చేసేందుకు ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు. దాంతో అన్‌సోల్డ్‌గా నిలిచిన ఇంగ్లండ్ వికెట్ కీపర్.

Nov 24, 2024, 7:40 pm IST

క్వింటన్ డికాక్‌ను రూ. 3.60 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

Nov 24, 2024, 7:28 pm IST

గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ

Nov 24, 2024, 7:27 pm IST

రూ. 3.4 కోట్లకు మిచెల్ మార్ష్‌ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Nov 24, 2024, 7:13 pm IST

మార్కస్ స్టోయినీస్‌ను రూ. 11 కోట్లకు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్

Nov 24, 2024, 7:10 pm IST

వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న కేకేఆర్

Nov 24, 2024, 6:59 pm IST

రవిచంద్రన్ అశ్విన్‌ను రూ. 9.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.

Nov 24, 2024, 6:53 pm IST

న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4 కోట్లకు ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసింది.

Nov 24, 2024, 6:52 pm IST

హర్షల్ పటేల్‌ను తీసుకున్న SRH

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

Nov 24, 2024, 6:43 pm IST

జేక్ ఫ్రీజర్-మెక్ గుర్క్‌‌కు రూ. 9 కోట్లు

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రీజర్-మెక్ గుర్క్‌ను పంజాబ్ కింగ్స్.. 5.50 కోట్లకు సొంతం చేసుకోగా.. ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 9 కోట్లకు సొంతం చేసుకుంది.

Nov 24, 2024, 6:40 pm IST

డేవిడ్ వార్నర్‌ను పట్టించుకోని ఫ్రాంచైజీలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దాంతో అతను అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరాడు. అయితే మరోసారి అతన్ని వేలం వేసే అవకాశం ఉంది.

Nov 24, 2024, 6:39 pm IST

రాహుల్ త్రిపాఠి‌కి రూ. 3.40 కోట్లు

టీమిండియా యువ బ్యాటర్ రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 3.40 కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

Nov 24, 2024, 6:37 pm IST

సొంతగూటికే డెవాన్ కాన్వే

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకే ఎంపికయ్యాడు.రూ. 6.25 కోట్లకు ఆ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేసింది.

Nov 24, 2024, 6:32 pm IST

మార్క్‌రమ్ మామకు రూ. 2 కోట్లే

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకే కొనుగోలు చేసింది.

Nov 24, 2024, 6:31 pm IST

అమ్ముడుపోని దేవదత్ పడిక్కల్

దేవదత్ పడిక్కల్ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు. దాంతో అతను అన్‌సోల్డ్‌గా నిలిచిపోయాడు. మరోసారి అతను వేలంలోకి వచ్చే అవకాశం ఉంది.

Nov 24, 2024, 6:28 pm IST

ఢిల్లీకి సొంతమైన హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు సొంతం చేసుకుంది.

Nov 24, 2024, 6:27 pm IST

‘కెప్టెన్సీ గురించి శ్రేయస్ అయ్యర్‌తో నేను ఇంకా మాట్లాడలేదు. వేలానికి ముందు అతనికి ఫోన్ చేశాను. కానీ అతను ఎత్తలేదు. ఐపీఎల్‌లో అతను విజయవంతమైన కెప్టెన్. ఢిల్లీ కోచ్‌గా అతనితో మూడు, నాలుగేళ్లు కలిసి పనిచేశాను. అతను గత సీజన్ విన్నర్ కూడా. మళ్లీ అతనితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అతను మా జట్టు తరఫున సత్తా చాటితే నేను చాలా సంతోషిస్తాను.’-రికీ పాంటింగ్

Nov 24, 2024, 5:55 pm IST

కేఎల్ రాహుల్‌ను పట్టించుకోని ఆర్‌సీబీ

టీమిండియా స్టార్ బ్యాటర్‌ కేఎల్ రాహుల్‌ను ఆర్‌సీబీ పట్టించుకోలేదు. మెగా వేలంలో అతని కోసం రూ. 11 కోట్ల వరకే బిడ్ వేసిన ఆర్‌సీబీ ఆ తర్వాత తప్పుకుంది. దాంతో అతను రూ. 14 కోట్ల అతి తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతమయ్యాడు.

Nov 24, 2024, 5:30 pm IST

కేఎల్ రాహుల్‌కు రూ. 14 కోట్లే

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకే దక్కించుకుంది. ఆశ్చర్యకరంగా రాహుల్ రూ. 14 కోట్లే పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Nov 24, 2024, 5:21 pm IST

ఆర్‌సీబీ గూటికి లియామ్ లివింగ్ స్టోన్

ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను ఆర్‌సీబీ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు రిప్లేస్‌మెంట్‌గా అతన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

Nov 24, 2024, 5:16 pm IST

సిరాజ్‌ను పట్టించుకోని ఆర్‌సీబీ

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటార్స్ రూ. 12 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్‌టీఎమ్ కార్డ్ కింద అతన్ని తీసుకునేందుకు ఆర్‌సీబీ నిరాకరించింది.

Nov 24, 2024, 5:14 pm IST

చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చాహల్

ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికి స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

Nov 24, 2024, 5:12 pm IST

సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 7.5 కోట్లకు సొంతం చేసుకుంది.

Nov 24, 2024, 5:11 pm IST

సన్‌రైజర్స్ గూటికి మహమ్మద్ షమీ

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10 కోట్లకు సొంతం చేసుకుంది. కేకేఆర్‌తో పోటీపడి మరి దక్కించుకుంది.

Nov 24, 2024, 4:44 pm IST

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. ఈ క్రమంలో అతను శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు, మిచెల్ స్టార్క్ రూ. 24.752 కోట్ల రికార్డులను అధిగమించాడు.

Nov 24, 2024, 4:43 pm IST

చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్‌ కొనుగోలు చేసింది. ఆర్‌టీఎమ్ కార్డ్ నయా రూల్ పంత్‌కు కలిసొచ్చింది. రూ. 20.75 కోట్లకే లక్నో అతన్ని దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించింది. వెంటనే లక్నో రూ. 27 కోట్లకు బిడ్ వేయడంతో ఢిల్లీ వెనకడుగు వేసింది.

Nov 24, 2024, 4:34 pm IST

మిచెల్ స్టార్క్‌కు షాక్

గత వేలంలో రూ.24.75 కోట్లు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ ఈసారి రూ.11.25 కోట్లు మాత్రమే దక్కించుకున్నాడు. స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

Nov 24, 2024, 4:25 pm IST

గుజరాత్‌కు జోస్ బట్లర్

జోస్ బట్లర్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.15.75 కోట్లకు సొంతం చేసుకుంది

Nov 24, 2024, 4:20 pm IST

శ్రేయస్‌పై కాసుల వర్షం

శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ వేలం చరిత్రలో అత్యంత భారీ ధర పలికిన ప్లేయర్‌గా శ్రేయస్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు స్టార్క్‌ (రూ.24.75 కోట్లు) పేరిట ఉండేది.

Nov 24, 2024, 4:04 pm IST

గుజరాత్‌కు రబాడ

కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. తమ మాజీ ప్లేయర్‌పై పంజాబ్ కింగ్స్ RTM కార్డ్‌ ఉపయోగించలేదు

Nov 24, 2024, 3:58 pm IST

అర్షదీప్ సింగ్ - రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్)

అర్షదీప్ సింగ్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ కోసం తొలుత సీఎస్కే-ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చాయి. అంతిమంగా రాజస్థాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్ పైచేయి సాధించి రూ.15.75 కోట్లుకు సొంతం చేసుకుంది. కానీ పంజాబ్ కింగ్స్ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించింది. దీంతో సన్‌రైజర్స్ రూ.18 కోట్లు చెల్లిస్తామని ముందుకొచ్చింది. కానీ ఆ మొత్తాన్ని వెచ్చిస్తామని చెప్పడంతో అర్షదీప్‌ను పంజాబ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది.

Nov 24, 2024, 3:43 pm IST

ప్రారంభమైన ఐపీఎల్ మెగా వేలం

ఐపీఎల్ నిర్వాహకులు మెగా వేలం నిబంధనల గురించి అన్ని ఫ్రాంచైజీలకు మరోసారి స్ఫష్టంగా తెలియజేస్తున్నారు. అలాగే ఐపీఎల్ ఖ్యాతి గురించి వివరిస్తున్నారు

Nov 24, 2024, 3:15 pm IST

మార్క్యూ లిస్ట్‌లు ఎన్ని? వేలం ఎలా మొదలవుతుంది?

ఆరుగురు చొప్పున ఆటగాళ్లతో రెండు మార్క్యూ లిస్ట్‌లు ఉన్నాయి. ఎమ్-1లో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జోస్ బట్లర్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. ఎమ్-2లో కేఎల్ రాహుల్, యుజువేంద్ర చాహల్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఈ మార్క్యూ లిస్ట్‌లతో వేలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లు విభాగాలుగా వేలం జరుగుతుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లలోనూ ఇదే తరహా వేలం జరుగుతుంది.

Nov 24, 2024, 2:41 pm IST

ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత మొత్తం?

పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 41 కోట్లు ఉన్నాయి. ఇక సీఎస్కే- రూ.55 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 73 కోట్లు, కేకేఆర్- రూ. 51 కోట్లు, ఆర్సీబీ- రూ. 83 కోట్లు, లక్నో- రూ. 69 కోట్లు, ముంబై ఇండియన్స్- రూ.45 కోట్లు, ఎస్‌ఆర్‌హెచ్- రూ.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్- రూ. 69 కోట్లు ఉన్నాయి.

Nov 24, 2024, 2:40 pm IST

ఏ ఫ్రాంచైజీ వద్ద ఎన్ని ఆర్‌టీఎమ్‌లు?

సీఎస్కే- 01 (క్యాప్డ్, అన్‌క్యాప్డ్‌లలో ఎవరినైనా తీసుకోవచ్చు) ఢిల్లీ- 02 (1 క్యాప్డ్ & 1 అన్‌క్యాప్డ్ / 2 క్యాప్డ్ ) ఆర్సీబీ- 03 (2 క్యాప్డ్ & 1 అన్‌క్యాప్డ్ / 3 క్యాప్డ్) లక్నో - 01 (క్యాప్డ్) పంజాబ్- 04 (క్యాప్డ్) ముంబై - 01 (అన్‌క్యాప్డ్) ఎస్ఆర్‌హెచ్ - 01 (అన్‌క్యాప్డ్) గుజరాత్- 01 (క్యాప్డ్).

Nov 24, 2024, 1:36 pm IST

లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.69 కోట్లు మిగిలి ఉన్నాయి. అలాగే ఒక క్యాప్డ్ ప్లేయర్ ఆర్‌టీఎమ్ ఉంది.

Nov 24, 2024, 1:34 pm IST

LSG రిటైన్ ప్లేయర్ల లిస్ట్

నికోలస్ పూరన్ (రూ. 21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ. 4 కోట్లు), ఆయుష్ బడోని (రూ. 4 కోట్లు)

Nov 24, 2024, 12:51 pm IST

తక్కువ ధరకే ఈ స్టార్ ప్లేయర్లు!

కొందరు స్టార్ ఆటగాళ్లకు తక్కువ ధర సొంతమవుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి ఆల్‌రౌండర్లకు డిమాండ్ ఉండదని క్రికెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు. 2027 సీజన్ వరకు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగడమే దీనికి కారణమని అంటున్నారు

Nov 24, 2024, 12:36 pm IST

CSK రిటైన్ ప్లేయర్ల లిస్ట్

రుతురాజ్ గైక్వాడ్ (రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా (రూ. 18 కోట్లు), మతీషా పతిరణ (రూ. 13 కోట్లు), శివమ్ దూబే (రూ. 12 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ. 4 కోట్లు)

Nov 24, 2024, 12:02 pm IST

ఎస్‌ఆర్‌హెచ్ వద్ద రూ.45 కోట్లు మిగిలి ఉన్నాయి. అలాగే ఒక ఆర్‌టీఎమ్ కార్డ్ ఉంది. తమ మాజీ ప్లేయర్లలో ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను ఆర్‌టీఎమ్‌ను ఉపయోగించుకుని తిరిగి దక్కించుకునే ఛాన్స్ ఉంది.

Nov 24, 2024, 11:59 am IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ ప్లేయర్లు

హెన్రిచ్ క్లాసెన్ (రూ. 23 కోట్లు), ప్యాట్ కమిన్స్ (రూ. 18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి (రూ. 6 కోట్లు)

Nov 24, 2024, 11:42 am IST

ఆర్సీబీ వద్ద ఎంత బడ్జెట్ ఉందంటే?

ఆర్సీబీ వద్ద ఇంకా రూ.83 కోట్లు మిగిలి ఉన్నాయి. అలాగే మూడు ఆర్‌టీఎమ్ కార్డ్‌లు ఉన్నాయి. వీటితో ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లు, ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. లేదా తమ ముగ్గురు మాజీ క్యాప్డ్ ప్లేయర్లను దక్కించుకోవచ్చు.

Nov 24, 2024, 11:38 am IST

ఆర్సీబీ రిటైన్ ప్లేయర్ల లిస్ట్

విరాట్ కోహ్లీ (రూ. 21 కోట్లు), రజత్ పాటిదార్ ( రూ. 11 కోట్లు), యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు)

Story first published: Sunday, November 24, 2024, 11:30 [IST]
Other articles published on Nov 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+