Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction 2025: డీఎస్పీ సార్‌ను వదిలేసిన ఆర్‌సీబీ!

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్‌ మహహ్మద్ సిరాజ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వదిలేసింది. దాంతో ఆ జట్టుతో తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌కు ఉన్న 6 ఏళ్ల బంధానికి తెరపడింది. సిరాజ్ కోసం ఆర్‌సీబీ కనీసం బిడ్ వేయకపోవగా.. ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించకునేందుకు కూడా ఆపసక్తి చూపలేదు.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్ల భారీ ధరకు ఈ హైదరాబాద్‌ పేసర్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన సిరాజ్.. ఆ మరుసటి ఏడాదే ఆర్‌సీబీలోకి వెళ్లాడు. 2018 మెగా వేలంలో ఆర్‌సీబీ సిరాజ్‌ను రూ. 2.5 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్ 2022లో రూ. 7 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2024 సీజన్ వరకు కొనసాగించింది. కానీ తాజా మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ.. సిరాజ్‌ను వదిలేసింది.

IPL Auction 2025 Gujarat Titans Buys Mohammed Siraj After RCB Ignores Him

దాంతో రూ. 2 కోట్ల కనీస ధరతో సిరాజ్ వేలానికి అందుబాటులోకి రాగా.. గుజారత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఆసక్తికనబర్చాయి. రూ.8 కోట్ల వరకు బిడ్ వేసిన చెన్నై.. ఆ తర్వాత తప్పుకుంది. రాజస్థాన్‌తో పోటీపడిన గుజరాత్ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగిస్తారా? అని ఆర్‌సీబీని అడగ్గా వారు నిరాకరించారు. దాంతో సిరాజ్.. గుజరాత్ సొంతమయ్యాడు.

ఇప్పటి వరకు 93 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 93 వికెట్లు తీసాడు. ఐపీఎల్ చరిత్రలోనే సిరాజ్‌కు ఇది అత్యధిక ధర. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో సిరాజ్ ఆడనున్నాడు. మహమ్మద్ షమీకి రిప్లేస్‌మెంట్‌గా ఆ జట్టు సిరాజ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా సిరాజ్ కోసం బిడ్ వేయలేదు.

IPL 2025 మెగా వేలం హైలైట్స్

అర్ష్‌దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్‌టీఎమ్)

కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)

జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)

మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

రిషభ్ పంత్-రూ. 27 కోట్లు(లక్నో సూపర్ జెయింట్స్)

మహమ్మద్ షమీ-రూ. 10 కోట్లు(SRH)

డేవిడ్ మిల్లర్-రూ. 7.5 కోట్లు(లక్నో సూపర్ జెయంట్స్)

యుజ్వేంద్ర చాహల్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్)

లియామ్ లివింగ్ స్టోన్-రూ. 8.75 కోట్లు(ఆర్‌సీబీ)

కేఎల్ రాహుల్-రూ. 14 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

హ్యారీ బ్రూక్-రూ.6.25 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)

దేవదత్ పడిక్కల్-అన్ సోల్డ్

ఎయిడెన్ మార్క్‌రమ్-రూ. 2 కోట్లు(లక్నో)

డేవాన్ కాన్వే- 6.25 కోట్లు (సీఎస్‌కే)

రాహుల్ త్రిపాఠి-రూ. 3.40 కోట్లు(సీఎస్‌కే)

డేవిడ్ వార్నర్-అన్‌సోల్డ్

జేక్ ఫ్రీజర్-మెక్ గుర్క్-రూ. 9 కోట్లు(ఢిల్లీ)

హర్షల్ పటేల్-రూ. 8 కోట్లు(SRH)

రచిన్ రవీంద్ర-రూ. 4 కోట్లు(సీఎస్‌కే)

ఆర్. అశ్విన్-రూ. 9.75 కోట్లు(సీఎస్‌కే)

వెంకటేశ్ అయ్యర్-రూ. 23.75 కోట్లు(కేకేఆర్)

Story first published: Sunday, November 24, 2024, 19:14 [IST]
Other articles published on Nov 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+