Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ అనామక ఆటగాడిపై కోట్లు కుమ్మరించిన కావ్యా పాప!

ఐపీఎల్ 2025 సీజన్‌ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు కనబరుస్తోంది. తమకు కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరిస్తోంది. అనామక బ్యాటర్ అయిన అభినవ్ మనోహర్‌ను రూ.3.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

రూ.30 లక్షల కనీస ధరతో మెగా వేలంలోకి వచ్చిన అభినవ్ మనోహర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీ, కేకేఆర్ పోటీ పడ్డాయి. దాంతో అతని ధర అమాంతం పెరిగింది. ముందుగా ఆర్‌సీబీ బిడ్ వేయగా.. ఆ తర్వాత సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ రేసులోకి వచ్చాయి. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 3.20 కోట్లకు సొంతం చేసుకుంది.

IPL Auction 2025 Abhinav Manohar Bought By SRH For INR 3 20 crore

ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన అభినవ్ మనోహర్.. ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు ఆడి 132.76 స్ట్రైక్‌రేట్‌తో 231 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో సెట్ అవుతాడనే ఉద్దేశంతో అభినమ్ మనోహర్‌ను సన్‌రైజర్స్ ఎంచుకుంది. అభినవ్ మనోహర్‌తో పాటు మరో అనామక ప్లేయర్ అథర్వ టైడ్‌ను అతని కనీస ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్(రూ. 11.25 కోట్లు), హర్షల్ పటేల్‌(రూ. 8 కోట్లు)ల కోసం బాగా ఖర్చు చేసింది. క్యాప్‌డ్ స్పిన్నర్ల జాబితాలో రాహుల్ చాహర్‌ను రూ. 3.2 కోట్లకు సొంతం చేసుకున్న సన్‌రైజర్స్.. ఆడమ్ జంపా కోసం రూ. 2.40 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ చురుకుగా వ్యవహరించింది. దాంతో కావ్య పాప తన మార్క్ సెలెక్షన్‌తో ఆకట్టుకుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

మహమ్మద్ షమీ రూ. 10 కోట్లు

హర్షల్ పటేల్-రూ. 8 కోట్లు

రాహుల్ చాహర్-రూ. 3.2 కోట్లు

ఆడమ్ జంపా-రూ. 2.40 కోట్లు

ఇషాన్ కిషన్‌ను రూ. 11.25 కోట్ల

అభినవ్ మనోహర్(రూ.3.20 కోట్లు)

అథర్వ టైడ్(రూ. 30 లక్షలు)

Story first published: Sunday, November 24, 2024, 22:39 [IST]
Other articles published on Nov 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+