IPL Auction 2025: 13 ఏళ్ల కుర్రాడికి రూ. 1.10 కోట్లు!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో సరికొత్త రికార్డ్ నమోదైంది. భారత్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అమ్ముడైన అతి పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కాడు. బిహార్‌కు చెందిన ఈ పసి బాలుడిని రాజస్థాన్ రాయల్స్ రూ. కోటీ పది లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. భారత క్రికెట్‌లోనే సెన్సేషన్‌గా మారిన ఈ కుర్రాడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడింది. చివరకు రాజస్థాన్ కోటీ 10 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది.
13 ఏళ్ల 243 రోజు వయసులోనే వైభవ్ సూర్య వంశీ మెగా వేలంలో పాల్గొనడంతో పాటు అమ్ముడయ్యాడు. చివరిసారిగా భారత్ వన్డే ప్రపంచకప్ 2011 గెలిచిన ఏడాది పుట్టిన ఈ కుర్రాడు.. అప్పుడే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. అండర్ 19 ఆసియాకప్ టోర్నీకి కూడా ఎంపికయ్యాడు.

ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్‌లో సూర్య వంశీ సెంచరీ బాది ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 58 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. దాంతో యూత్ టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డ్ సాధించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే సూర్య వంశీ.. బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేస్తే.. ఈ కుర్రాడు మరో రికార్డ్ సాధించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కుతాడు. 13 ఏళ్ల సూర్య వంశీకి రూ. 1.10 కోట్లు దక్కడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వయసులో తాము బుక్స్ పట్టుకొని చదువుతున్నామని, బ్యాట్ కూడా పట్టలేదని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఏంటి మమ్మీ..ఎవడీడు..? అనే సెటైర్లు పేల్చుతున్నారు.
ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లపై ఎలాంటి వయసు నిబంధన లేదు. కానీ 19 ఏళ్ల వయసు కన్న తక్కువ ఉన్న ప్లేయర్లను తీసుకోవాలనుకుంటే మాత్రం వారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లేదా లిస్ట్ క్రికెట్ ఆడాలి. ఈ రెండు ఆడకుండా రెండు తీసుకోవడానికి వీల్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లోని ఆటగాళ్లపై ఏజ్ లిమిట్ లేదు. సచిన్ 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications