Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction 2024 ఎన్ని గంటలకు? ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మినీ వేలానికి రంగం సిద్దమైంది. దుబాయ్‌లోని కోక కోలా అరెనా వేదికగా రేపు( డిసెంబర్ 19, మంగళవారం) ఈ కార్యక్రమం జరగనుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ వేలం షురూ కానుంది. మొత్తం 1166 మంది ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చగా.. పది ఫ్రాంచైజీలు 333 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశాయి.

ఇందులో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్ సీస్ స్లాట్స్ ఉన్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఈ వేలానికి సంబంధించిన ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి.

 IPL Auction 2024: When and Where To Watch IPL Mini Auction Live Telecast

మాక్ ఆక్షన్స్‌తో ప్రాక్టీస్ కూడా చేశాయి. నచ్చిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ సారి వేలంలో ఆక్షనీర్‌గా మల్లికా సాగర్ వ్యవహరించనుంది. ఐపీఎల్ వేలంలో ఆక్షనీర్‌గా వ్యవహరించనున్న తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కనుంది. ఇప్పటికే ఆమె వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు సంబంధించిన వేలాన్ని నిర్వహించారు.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలాన్ని అధికారిక టీవీ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్.. తమ అన్నీ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఓటీటీ రైట్స్ దక్కించుకున్న జియో సినిమాలో ఈ వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. జియో సినిమా యాప్‌లో ఈ లైవ్‌ను ఉచితంగా చూసే వెసులుబాటు ఉండగా.. స్టార్ స్పోర్ట్స్‌లో చూడాలంటే మాత్రం ఆ చానెల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. టీవీలో కూడా జియోసినిమా యాప్ ద్వారా ఫ్రీగా కూడా చూడవచ్చు.

ఫ్రాంచైజీల వారీగా అందుబాటులో ఉన్న పర్స్ వాల్యూ
1. చెన్నై సూపర్ కింగ్స్-రూ. 31.4 కోట్లు
2. ఢిల్లీ క్యాపిటల్స్ -రూ.28.95 కోట్లు
3. గుజరాత్ టైటాన్స్ -రూ. 38.15 కోట్లు
4. కేకేఆర్ -రూ. 32.7 కోట్లు
5.ఎల్‌ఎస్‌జీ -రూ. 13.5 కోట్లు
6.ముంబై ఇండియన్స్ -రూ.17.75 కోట్లు
7. పంజాబ్ కింగ్స్ -రూ. 29.1 కోట్లు
8. ఆర్‌సీబీ -రూ.23.25 కోట్లు
9. రాజస్థాన్ రాయల్స్ -రూ. 14.5 కోట్లు
10. ఎస్‌ఆర్‌హెచ్ -రూ. 34 కోట్లు

Story first published: Monday, December 18, 2023, 17:35 [IST]
Other articles published on Dec 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+