Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction 2024: ఆ ముగ్గురిపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి రంగం సిద్దమైంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు దుబాయ్‌లోని కోక కోలా అరెనా వేదికగా ఆటగాళ్ల వేలం మొదలవ్వనుంది. పది ఫ్రాంచైజీల్లో గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్‌సీస్ స్థానాలు ఉన్నాయి. ఈ మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి.

టీమ్ బలహీనతలను అధిగమించే ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాయి. మాక్ ఆక్షన్‌లతో ప్రాక్టీస్ కూడా చేశాయి. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. జట్టును మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర రూ. 34 కోట్ల పర్స్ మనీ ఉండగా.. ఆ జట్టులో గరిష్టంగా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు ఓవర్‌సీస్ స్లాట్స్ ఉన్నాయి. దాదాపు కోర్ ప్లేయర్లందరినీ రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. భారీ ధరకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, అకీల్ హోస్సెన్‌లతో పాటు వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగీలను వదిలేసింది. ట్రేడింగ్‌లో భాగంగా షెహ్‌బాజ్ అహ్మద్‌ను ఆర్‌సీబీ నుంచి తెచ్చుకుంది.

ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సమతూకంగా కనిపిస్తున్నా.. ఆ జట్టుకు ఓ స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాటర్‌తో పాటు ఓవర్‌సీస్ పేసర్, క్వాలిటీ స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో పాటు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర లేదా వానిందు హసరంగా, గెరాల్డ్ కోయిట్జీ‌ని తీసుకునేందుకు ఆసక్తి చూపించవచ్చు.

 IPL Auction 2024: What Areas Sunrisers Hyderabad Need To Address Ahead Of upcoming Season?

1.ట్రావిస్ హెడ్..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు విధ్వంసకర ఓపెనర్ లోటు ఉంది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో తర్వాత ఆ స్థాయి ఓపెనర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు లభించలేదు. గత సీజన్‌లో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసినా.. సరైన ఆరంభాలు అందించలేకపోయారు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో సత్తా చాటిన ట్రావిస్ హెడ్‌ను తీసుకునేందుకు సన్‌రైజర్స్ ప్రణాళికలు రచిస్తోంది. ఒకవేళ అతను చిక్కకుంటే రచిన్ రవీంద్ర కోసం ప్రయత్నించవచ్చు.

 IPL Auction 2024: What Areas Sunrisers Hyderabad Need To Address Ahead Of upcoming Season?

2. గెరాల్డ్ కోయిట్జీ..
సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయిట్జీతో పాటు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయత్నించవచ్చు. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ భారీ ధర పలకనున్న నేపథ్యంలో ఆ జట్టు గెరాల్డ్ కోయిట్జీ కోసం తీవ్రంగా ప్రయత్నించనుంది. పైగా అతను సౌతాఫ్రికా ప్లేయర్ కావడం.. మార్క్‌రమ్‌కు తెలిసినవాడు కావడంతో అతనిపై కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది.

3. వానిందు హసరంగా..
రషీద్ ఖాన్‌ను దూరం చేసుకున్న తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆ తరహా క్వాలిటీ స్పిన్నర్ దొరకలేదు. ఈ క్రమంలోనే వానిందు హసరంగా కోసం ఆ జట్టు ప్రయత్నించవచ్చు. అయితే తుది జట్టులో ఓవర్‌సీస్ ఆటగాళ్లకు నలుగురికి మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో హసరంగాకు బదులు దేశీయ స్పిన్నర్‌పై ఫోకస్ పెట్టవచ్చు.

Story first published: Monday, December 18, 2023, 21:32 [IST]
Other articles published on Dec 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+