IPL Auction 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి ట్రావిస్ హెడ్.. ధర ఎంతంటే..?
IPL Auction 2024: ఊహించనట్లుగానే ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్, వరల్డ్ కప్ విన్నర్ ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. దుబాయ్‌లోని కోక కోలా అరెనా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ. 6.80 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరీ దక్కించుకుంది.
టీమ్ ఓనర్ కావ్య మారన్‌తో టీమ్‌మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ట్రావిస్ హెడ్‌ను తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓవర్‌సీస్ బ్యాటర్ అవసరం ఉంది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో తర్వాత ఆ స్థాయి ఓపెనర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు లభించలేదు. గత సీజన్‌లో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసినా.. సరైన ఆరంభాలు అందించలేకపోయారు.

ఈ క్రమంలోనే ధాటిగా ఆడగలిగే ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ టార్గెట్ చేసి సొంతం చేసుకుంది. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ వికెట్ ట్రావిస్ హెడ్ శైలికి సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను విజేతగా నిలబెట్టిన ట్రావిస్ హెడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతాయని అంతా అనుకున్నారు.
కానీ ఆరంభంలో సన్‌రైజర్స్ మినహా మరే ఫ్రాంచైజీ బిడ్ చేయలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో అతని సొంతం చేసుకుంటుందనగా.. చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పోటీలోకి వచ్చింది. సన్‌రైజర్స్ ఎలాగైనా తీసుకుంటుందని భావించి అతని ధరను పెంచింది. చెన్నై పోటీ పడటంతో ట్రావిస్ హెడ్.. రూ. 6.80 కోట్ల భారీ ధర పలికాడు.
ట్రావిస్ హెడ్‌ను తీసుకోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకోవడం కలిసొచ్చే అంశమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోటి రూపాయలు ఎక్కువ పలికినా.. హైదరాబాద్ వికెట్‌కు అతను పక్కగా సరిపోతాడని అంటున్నారు. అతను పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా జట్టుకు ఉపయోగపడుతాడని చెబుతున్నారు.
గతంలో ఆర్‌సీబీ తరఫున ఆడిన ట్రావిస్ హెడ్ 10 మ్యాచ్‌ల్లో 205 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసాడు. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ట్రావిస్ హెడ్ సత్తా చాటడంతో అతనికి ప్రాధాన్యత దక్కింది. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications