Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction 2024: ఆ రికార్డ్ బద్దలయ్యేనా..?

IPL Auction 2024: వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి రంగం సిద్దమైంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు దుబాయ్‌లోని కోక కోలా అరెనా వేదికగా ఆటగాళ్ల వేలం మొదలవ్వనుంది. పది ఫ్రాంచైజీల్లో గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్‌సీస్ స్థానాలు ఉన్నాయి. ఈ మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి.

అయితే ఈ వేలంలో ఏమైనా సంచలనాలు నమోదవుతాయా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 16 ఏళ్ల చరిత్ర కలిగిన ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికి ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ నిలిచాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అతన్ని రూ. 18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

 IPL Auction 2024: Sam Currans Auction Record Will Be Broken

గత సీజన్ వేలంలోనే సామ్ కరణ్‌తో పాటు కామెరూన్ గ్రీన్(రూ. 17.5 కోట్లు-ముంబై ఇండియన్స్), బెన్ స్టోక్స్(రూ.16.25 కోట్లు, సీఎస్‌కే), నికోలస్ పూరన్(రూ.16 కోట్లు, ఎల్‌ఎస్‌జీ) భారీ ధర పలికారు.

ఐపీఎల్ 2024 వేలంలో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌, జోష్ హజెల్ వుడ్‌తో పాటు రచిన్ రవీంద్ర, వానిందు హసరంగా, కోయెట్జీ భారీ ధర పలికే అవకాశం ఉంది.

సీజన్ల వారిగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు

1. ఐపీఎల్ 2023: సామ్ కరణ్- రూ. 18.5 కోట్లు( పంజాబ్ కింగ్స్)

2. ఐపీఎల్ 2022: ఇషాన్ కిషన్- రూ. 15.25 కోట్లు( ముంబై ఇండియన్స్)

3. ఐపీఎల్ 2021: క్రిస్ మోరిస్- రూ. 16.25 కోట్లు( రాజస్థాన్ రాయల్స్)

4.ఐపీఎల్ 2020: ప్యాట్ కమిన్స్-రూ. 15.5 కోట్లు(కేకేఆర్)

5. ఐపీఎల్ 2019: జయదేవ్ ఉనాద్కత్(రాజస్థాన్), వరుణ్ చక్రవర్తి(పంజాబ్ కింగ్స్)- రూ. 8.4 కోట్లు

6. ఐపీఎల్ 2018: బెన్ స్టోక్స్- రూ. 12.5 కోట్లు( రాజస్థాన్ రాయల్స్)

7.ఐపీఎల్ 2017: బెన్ స్టోక్స్-రూ. 14.5 కోట్లు(రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్)

8.ఐపీఎల్ 2016: షేన్ వాట్సన్-రూ. 9.5 కోట్లు(ఆర్‌సీబీ)

9. ఐపీఎల్ 2015: యువరాజ్ సింగ్-రూ. 16 కోట్లు(ఢిల్లీ డేర్ డేవిల్స్)

10. ఐపీఎల్ 2014: యువరాజ్ సింగ్- రూ.14 కోట్లు(ఆర్‌సీబీ)

11. ఐపీఎల్ 2013: గ్లేన్ మ్యాక్స్‌వెల్-రూ.6.3 కోట్లు(ముంబై ఇండియన్స్)

12. ఐపీఎల్ 2012: రవీంద్ర జడేజా-రూ. 12.8 కోట్లు(సీఎస్‌కే)

13. ఐపీఎల్ 2011: గౌతమ్ గంభీర్-రూ. 14.9 కోట్లు(కేకేఆర్)

14. ఐపీఎల్ 2010: షేన్ బాండ్, కీరన్ పోలార్డ్-రూ. 4.8 కోట్లు(కేకేఆర్, ముంబై)

15. ఐపీఎల్ 2009: కెవిన్ పీటర్సన్(ఆర్‌సీబీ), ఆండ్రూ ఫ్లింటాఫ్(సీఎస్‌కే)-రూ. 9.8 కోట్లు

16. ఐపీఎల్ 2008: మహేంద్ర సింగ్ ధోనీ-రూ. 9.5 కోట్లు(సీఎస్‌కే)

Story first published: Monday, December 18, 2023, 22:58 [IST]
Other articles published on Dec 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+