Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 వేలం.. అమ్ముడుపోయిన తొలి ప్లేయర్ ఎవరంటే..?

IPL Auction 2024 ప్రారంభమైంది. తొలి సెట్‌లో అంతర్జాతీయ బ్యాటర్లను వేలం వేసారు. ఈ సీజన్‌లో అమ్ముడుపోయిన తొలి ప్లేయర్‌గా వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ రోవ్‌మన్ పోవెల్ నిలిచాడు. రూ. కోటి రూపాయల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్న రోవ్‌మన్ పొవెల్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్.. నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.

ఆరంభంలో 10 లక్షలను మాత్రమే పెంచుకుపోయిన ఇరు జట్లు ఆ తర్వాత ఒక్కసారిగా ధరను పెంచేసాయి. చివరిగా రూ. 7.40 కోట్లకు రోవ్‌మన్ పోవెల్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రోవ్‌మన్ పోవెల్ కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

IPL Auction 2024: Rovman Powell 1st player sold, Rajasthan Royals buy him for Rs 7.4 crore

ఓవరాల్‌గా 17 మ్యాచ్‌ల్లో 257 పరుగులతో ఓ వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌తో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఆసక్తి కనబర్చాయి. చివరకు రూ.740 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రోవ్‌మన్ పోవెల్‌ను రూ. 2.80 కోట్లకు కొనుగోలు చేసింది. తాజా వేలంలో అతని ధర నాలుగింతలు పెరగడం విశేషం.

66 అంతర్జాతీయ టీ20లు ఆడిన రోవ్‌మన్ పోవెల్..1202 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. బౌలింగ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో 184 మ్యాచ్‌లు ఆడి 3369 రన్స్ బాదాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 14 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 26 వికెట్లు తీసాడు.

Story first published: Tuesday, December 19, 2023, 13:34 [IST]
Other articles published on Dec 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+