Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ ధర.. సన్‌రైజర్స్‌లోకి ప్యాట్ కమిన్స్!

ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఈ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది.

రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తీవ్రంగా పోటీపడ్డాయి. ఇరు ఫ్రాంచైజీలు తగ్గేదేలే అన్నట్లు పోటీపడటంతో కమిన్స్ ధర అమాంతం పెరిగిపోయింది.

IPL Auction 2024: Pat Cummins creates history, sold for Rs 20.5 cr to SRH

చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. దాంతో గత సీజన్‌లో అత్యధిక ధర రూ. 18.50 కోట్లకు అమ్ముడైన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ రికార్డ్ బద్దలైంది. పంజాబ్ కింగ్స్‌ సామ్ కరణ్‌ను రూ. 18.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డ్ ధరగా ఉండగా.. తాజా వేలంలో కమిన్స్ బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో కమిన్స్ రూ. 15.5 కోట్లు పలికాడు. అప్పుడు కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్ వరకు ఆ జట్టుకే ఆడిన అతను.. వన్డే ప్రపంచకప్, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం గత సీజన్ ఐపీఎల్ ఆడలేదు. ఇప్పటి వరకు 42 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కమిన్స్.. 45 వికెట్లతో 379 పరుగులు చేశాడు. లోయరార్డ్‌లో పరుగులు చేయగల సామర్థ్యం ఉండటం.. ప్రపంచకప్ గెలిచిన అదృష్టం ప్యాట్ కమిన్స్‌కు కలిసొచ్చింది.

సీజన్ల వారిగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు

1. ఐపీఎల్ 2024: మిచెల్ స్టార్క్-రూ.24.75 కోట్లు(కేకేఆర్); ప్యాట్ కమిన్స్-రూ. 20.50 కోట్లు(సన్‌రైజర్స్ హైదరాబాద్)

2. ఐపీఎల్ 2023: సామ్ కరణ్- రూ. 18.5 కోట్లు( పంజాబ్ కింగ్స్)

3. ఐపీఎల్ 2022: ఇషాన్ కిషన్- రూ. 15.25 కోట్లు( ముంబై ఇండియన్స్)

4. ఐపీఎల్ 2021: క్రిస్ మోరిస్- రూ. 16.25 కోట్లు( రాజస్థాన్ రాయల్స్)

5.ఐపీఎల్ 2020: ప్యాట్ కమిన్స్-రూ. 15.5 కోట్లు(కేకేఆర్)

6. ఐపీఎల్ 2019: జయదేవ్ ఉనాద్కత్(రాజస్థాన్), వరుణ్ చక్రవర్తి(పంజాబ్ కింగ్స్)- రూ. 8.4 కోట్లు

7. ఐపీఎల్ 2018: బెన్ స్టోక్స్- రూ. 12.5 కోట్లు( రాజస్థాన్ రాయల్స్)

8.ఐపీఎల్ 2017: బెన్ స్టోక్స్-రూ. 14.5 కోట్లు(రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్)

9.ఐపీఎల్ 2016: షేన్ వాట్సన్-రూ. 9.5 కోట్లు(ఆర్‌సీబీ)

10. ఐపీఎల్ 2015: యువరాజ్ సింగ్-రూ. 16 కోట్లు(ఢిల్లీ డేర్ డేవిల్స్)

11. ఐపీఎల్ 2014: యువరాజ్ సింగ్- రూ.14 కోట్లు(ఆర్‌సీబీ)

12. ఐపీఎల్ 2013: గ్లేన్ మ్యాక్స్‌వెల్-రూ.6.3 కోట్లు(ముంబై ఇండియన్స్)

13. ఐపీఎల్ 2012: రవీంద్ర జడేజా-రూ. 12.8 కోట్లు(సీఎస్‌కే)

14. ఐపీఎల్ 2011: గౌతమ్ గంభీర్-రూ. 14.9 కోట్లు(కేకేఆర్)

15. ఐపీఎల్ 2010: షేన్ బాండ్, కీరన్ పోలార్డ్-రూ. 4.8 కోట్లు(కేకేఆర్, ముంబై)

16. ఐపీఎల్ 2009: కెవిన్ పీటర్సన్(ఆర్‌సీబీ), ఆండ్రూ ఫ్లింటాఫ్(సీఎస్‌కే)-రూ. 9.8 కోట్లు

17. ఐపీఎల్ 2008: మహేంద్ర సింగ్ ధోనీ-రూ. 9.5 కోట్లు(సీఎస్‌కే)

Story first published: Tuesday, December 19, 2023, 14:43 [IST]
Other articles published on Dec 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+