Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction 2024: మెరిసిన కావ్య మారన్.. కోట్లు కుమ్మరిస్తూ చిరునవ్వులు! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మెరిసింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆటగాళ్ల‌పై బిడ్ వేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లకార్డ్‌ను ప్రదర్శిస్తూ వ్యూహాత్మకంగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి, జట్టు స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీ ధరణ్‌తో కలిసి కావ్య మారన్ వేలంలో పాల్గొంది.

జట్టుకు ఓ లెఫ్టాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అవసరం ఉండగా.. ట్రావిస్ హెడ్‌ను కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరీ రూ. 6.80 కోట్లకు దక్కించుకుంది. ట్రావిస్ హెడ్ తమకు సొంతమైన అనంతరం కావ్య మారన్ చిరునవ్వులు చిందించింది. ఆమె నవ్వుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IPL Auction 2024: Netizens Go Crazy After Kaviya Maran Spotted in IPL 2024 Auction

కావ్య పాప నవ్విందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ మొత్తం కావ్య మారన్ ఇలానే నవ్వుతూ ఉండాలని ఆదేవుణ్ని ప్రార్థిస్తున్నారు.
గత నాలుగు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమవుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో అయితే ఎన్నడూ లేని విధంగా పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. కెప్టెన్ మార్చినా.. కోట్లు కుమ్మరించి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మారలేదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర వైఫల్యంతో కావ్య మారన్ ముఖంలో నవ్వు కనిపించలేదు. జట్టు చెత్త ప్రదర్శనతో కొన్ని మ్యాచ్‌లకు ఆమె హాజరు కూడా కాలేదు.

కావ్య మారన్ బాధపడటం చూసి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు. చివరకు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం కావ్య మారన్ బాధపడటం చూడలేక టీవీ చానెల్ మార్చినట్లు వెల్లడించారు. అప్‌కమింగ్ సీజన్‌లోనైనా జట్టును బలోపేతం చేయాలని కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్‌కు సూచించారు.

జైలర్ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ వైఫల్యాన్ని ప్రస్తావించారు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఓడినప్పుడు స్టేడియంలో కావ్య మారన్ నిరాశగా ఉండటం చూడలేకపోతున్నా.

ఆమె బాధ పడటం చూసి తట్టుకోలేక చాలా సందర్భాల్లో టీవీ ఛానెల్‌ను మార్చేసాను. కళానిధి మారన్‌ను నేను కొరేది ఒక్కటే. జట్టులోకి మంచి ఆటగాళ్లను తీసుకొని బలోపేతం చేయండి. వేలంలో మెరుగైన ఆటగాళ్లపై డబ్బులు ఖర్చు చేయండి. అప్‌కమింగ్ సీజన్‌లోనైనా కావ్య మారన్ ఎగిరి గంతేయడం మేం చూడాలి.'అని రజినీకాంత్.. కళానిధి మారన్‌ను కోరారు.

ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 వేలంలో ట్రావిస్ హెడ్‌ను కొనుగోలు చేసిన అనంతరం కావ్య మారన్ ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ట్రావిస్ హెడ్‌తో పాటు వానిందు హసరంగాను రూ. కోటి 50 లక్షలకే సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ప్యాట్ కమిన్స్‌కు రికార్డు ధర రూ. 20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

Story first published: Tuesday, December 19, 2023, 14:26 [IST]
Other articles published on Dec 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+