Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Auction 2024: సిరిసిల్ల బిడ్డకు సీఎస్‌కే ఛాన్స్!

ఐపీఎల్ 2024 వేలంలో తెలంగాణ క్రికెటర్‌కు అవకాశం దక్కింది. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన వేలంలో సిరిసిల్లకు చెందిన అరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 20 లక్షలకు తీసుకుంది. వేలం చివర్లలో ఈ 18 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ పేరు రాగా.. సీఎస్‌కే కొనుగోలు చేసింది.

ఈ సారి మొత్తం 11 మంది తెలుగు ఆటగాళ్లు బరిలో నిలవగా.. కేఎస్ భరత్‌తో పాటు అవనీశ్ రావు మాత్రమే అమ్ముడయ్యారు. మిగతా 9 మంది ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా నిలిచిపోయారు.

IPL Auction 2024: Chennai Super Kings buy a Telugu Player Avanish Rao Aravelly


రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన అవనీశ్ ఇటీవలే టీమిండియా అండర్ 19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. ఇక అండర్ 19 ముక్కోణపు సిరీస్‌లో అవనీశ్ అద్బుత ప్రదర్శన కనబర్చాడు. ఓ మ్యాచ్‌లో 376 పరుగుల లక్ష్యచేధనకు దిగిన భారత్ అండర్ 19 టీమ్ ఓ దశలో 95/5 కష్టాల్లో పడగా.. అవనీశ్ ఆదుకున్నాడు.

93 బంతుల్లో 163 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో అతను 12 సిక్సర్లు బాదడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌కు ఫిదా అయినా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ వేలంలో అతని పేరు రాగానే కొనుగోలు చేసింది. టీమ్ భవిష్యత్తుకు బాటలు వేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్.. అందుకు అతను పనికి వస్తాడని భావించి జట్టులోకి తీసుకుంది.

ఇప్పటికే ఆంధ్రకు చెందిన షేక్ రషీద్ చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు మరో తెలుగోడు ఆ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత నెలలోనే దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అవనీశ్.. హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో 6 ఇన్నింగ్స్‌ల్లో 274 పరుగులు చేశాడు. అండర్ 19 ఆసియా కప్‌లో టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా వ్యవహరించిన అవనీశ్.. వచ్చే నెలలో సౌతాఫ్రికా వేదికగా జరిగే ప్రపంచకప్‌లోనూ భారత్ అండర్ 19‌కు వికెట్ కీపింగ్ చేయనున్నాడు.

తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎప్పటిలానే ఒక్క తెలుగు ప్లేయర్‌కు అవకాశం ఇవ్వలేదు. విదేశీ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించిన ఆ జట్టు.. దేశీయ ఆటగాళ్లను తీసుకోవడంపై మాత్రం ఫోకస్ పెట్టలేదు.

Story first published: Tuesday, December 19, 2023, 22:29 [IST]
Other articles published on Dec 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+