Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021 Auction: చరిత్ర సృష్టించిన క్రిస్ మోరిస్.. వేలం రికార్డులన్నీ బ్రేక్!

IPL Auction 2021: RR Signs Chris Morris For 16.25 Crore

చెన్నై: ఐపీఎల్ 2021 వేలంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ చరిత్ర సృష్టించాడు. గత వేలం రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ సఫారీ ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలన్నీ ఆసక్తికనబర్చాయి. దాంతో రూ. 75 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన క్రిస్ మోరీస్ ఏకంగా.. రూ.16.25 కోట్లు పలికాడు. ఇంత భారీ ధరకు అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అతని కోసం కింగ్స్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆఖరి వరకు పోటీపడ్డాయి. దాంతో మోరీస్ ధర అమాంత పెరిగిపోయింది.

హయ్యెస్ట్ ప్రైజ్..

హయ్యెస్ట్ ప్రైజ్..

ఇక 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రూ.16 కోట్లు హయ్యెస్ట్ ప్రైజ్‌గా ఉండగా.. తాజాగా క్రిస్ మోరీస్ రూ.16.25 లక్షలతో దాన్ని అధిగమించాడు. 2015 సీజన్ వేలంలో యువరాజ్ సింగ్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.16 కోట్లు వెచ్చించి తీసుకుంది. ఇక టాప్-5 అత్యధిక ధరలను పరిశీలిస్తే.. గత సీజన్ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.15.5 కోట్లకు కొనుగోలు చేయగా.. 2017లో రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ బెన్ స్టోక్స్‌ను రూ.14.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత తాజా సీజన్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను రూ.14.25 కోట్లకు ఆర్‌సీబీ తీసుకుంది. ఇక 2014‌లో ఆర్‌సీబీనే యువరాజ్ సింగ్‌ను రూ. 14 కోట్ల భారీ ధరకు తీసుకుంది.

అప్పుడు రూ.10 కోట్లు..

అప్పుడు రూ.10 కోట్లు..

గత సీజన్‌లో క్రిస్ మోరీస్‌ను ఆర్‌సీబీ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో మోరీస్ గాయాలతో ఇబ్బందిపడ్డాడు. దాంతో అతన్ని వేలంలోకి వదిలేసిన ఆర్‌సీబీ తక్కువ ధరకు తీసుకుందామని ప్రయత్నించింది. కానీ ఇతర ఫ్రాంచైజీల నుంచి తీవ్ర పోటీ ఉండటంతో వెనక్కు తగ్గింది. మొత్తానికి క్రిస్ మోరీస్ ఊహించని ప్రైజ్‌తో మంచి జాక్ పాట్ కొట్టాడు. అయితే క్రిస్ మోరీస్‌కు ఇంత ధరకు అమ్ముడుపోవడంపై విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంచి ప్లేయర్ అయినప్పటికీ ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయని, అతను ఏ మేరకు రాణిస్తాడో చూడాలంటున్నారు.

 బోల్తా కొట్టించిన ముంబై..

బోల్తా కొట్టించిన ముంబై..

క్రిస్ మోరీస్ విషయంలో ఇతర ఫ్రాంచైజీలను ముంబై ఇండియన్స్ బోల్తా కొట్టించినట్లు స్పష్టం అవుతోంది. ముంబై పర్స్‌లో రూ.15 కోట్లు మాత్రమే ఉండగా.. ఆ ఫ్రాంచైజీ మోరీస్ కోసం ఏకండా రూ.12 కోట్ల వరకు బిడ్ చేసింది. ముంబై రేసులోకి రావడంతో కింగ్స్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. చివరి నిమిషంలో ముంబై తప్పుకోగా.. రాజస్థాన్, పంజాబ్ మధ్య బిడ్ వార్ నడిచింది. చివరకు రాజస్థాన్ భారీ ధరకు మోరీస్ తీసుకుంది. అయితే సహచరులను పక్కదారి పట్టించడంతో ముంబై సఫలమైందని, తన బిజినెస్ మైండ్‌ను ఇక్కడ ఉపయోగించిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Thursday, February 18, 2021, 17:19 [IST]
Other articles published on Feb 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+