Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021 Auction: అనామక క్రికెటర్ షారూఖ్ ఖాన్‌పై కనక వర్షం!

IPL Auction 2021: Punjab Kings buys Shahrukh Khan for Rs 5.25 crores
IPL 2021 Auction : #PunjabKings Buys Shahrukh Khan For Rs 5.25 Crores || Oneindia Telugu

చెన్నై: ఐపీఎల్ 2021 వేలంలో అనామక క్రికెటర్ షారుఖ్ ఖాన్‌పై కనక వర్షం కురిసింది. తమిళానడు చెందిన ఈ బ్యాట్స్‌మన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రతిష్టాత్మక డొమెస్టిక్ టోర్నీ సెమీఫైనల్లో 19 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. దాంతో ఈ యువ ఆటగాడిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఈ యువ ఆల్‌రౌండర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కోసం ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడటంతో ధర అమాంతం పెరిగిపోయింది.

ఇక షారుఖ్ ఖాన్‌కు ఇదే ఫస్ట్ ఐపీఎల్ సీజన్. గత వేలంలో అతనికి నిరాశే ఎదురైంది. దానికి ఏమాత్రం నిరాశ చెందని ఈ తమిళనాడు క్రికెటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇరగదీశాడు. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకొని ఐపీఎల్ వేలం జాక్‌పాట్ కొట్టాడు. ఇక కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. సచిన్ బేబీ, రజత్ పటీదర్‌లను రూ.20 లక్షల కనీధరకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన మహ్మద్ అజారుద్దీన్‌ను కూడా ఆర్‌సీబీ రూ.20 లక్షల కనీస ధరకు తీసుకుంది.

Story first published: Thursday, February 18, 2021, 17:52 [IST]
Other articles published on Feb 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+