రూ. 16 కోట్ల నుంచి 1కోటికి పడిపోయిన యువీ.. కొనుగోలు చేస్తారా?

జైపూర్: భారత వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. జైపూర్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుండగా.. తన ధరని రూ. కోటికి తగ్గించుకుని యువీ పోటీలోకి వచ్చాడు. భారత క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఫామ్‌లో లేక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఫిట్ నెస్ సమస్యతో జట్టుకు దూరంగా ఉండటం యువీ ప్రధాన సమస్యగా మారింది.
రూ.16 కోట్ల నుంచి ఒక కోటికి పడిపోయి
2015 ఐపీఎల్ సీజన్‌లో రూ. 16 కోట్లతో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డులు నెలకొల్పిన యువరాజ్ సింగ్ గత ఏడాదన్నరకాలంగా టీమిండియాకి దూరంగా ఉండటం, 2018 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగా అతనిపై ఫ్రాంఛైజీలు అయిష్టం కనబరుస్తున్నాయి. యువీ.. తాజా వేలంలో కనీస ధర రూ. కోటికి పడిపోయాడు. నిరుడు ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున యువరాజ్ 8 మ్యాచ్‌ల్లో 65 పరుగులే చేశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతడ్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ వేలంలోకి విడిచిపెట్టింది.
3..4 టెస్టులకు భారత జట్టిదే, మయాంక్, పాండ్యాలకు చోటు

ఒత్తిడికి గురైన యువీ ధరను తగ్గించుకుని
దీంతో.. ఒత్తిడికి గురైన యువీ.. తన కనీస ధరని రూ. కోటికి తగ్గించుకున్నాడు. క్రికెట్ అంటే ప్రాణపదంగా భావించే యువీ ఇటీవల విదేశాలకు వెళ్లి తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీలోనూ పరుగులు చేశాడు. ఒకప్పుడు కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు.. యువీని ఇప్పుడు కనీస ధరకైనా ఎంచుకుంటాయా అనే సందేహం నెలకొంది. మంగళవారం జైపూర్‌లో జరిగే ఐపీఎల్ వేలంలో 346 మంది క్రికెటర్లతో జాబితాను కుదించగా.. వీరిలో 70 మంది ఆటగాళ్లు ఎంపికయ్యే అవకాశం ఉంది.

యువీతో పాటుగా అదృష్టం పరీక్షించుకునేందుకు
యువీతోపాటు భారత టెస్ట్ ఆటగాళ్లు చటేశ్వర పుజార(కనీస ధర రూ.75లక్షలు), ఇషాంత్ శర్మ(కనీస ధర రూ.50 లక్షలు) మరోసారి వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్-12 ముగిసిన రెండు వారాల్లోనే వన్డే ప్రపంచకప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో పాటు కొన్ని విదేశీ జట్ల ఆటగాళ్లు లీగ్‌కు దూరమవుతున్నారు. మాక్స్‌వెల్, ఫించ్ తదితరులు వేలం నుంచి తప్పుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications