IPL All Star Game: కోహ్లీ, రోహిత్ ఒక్కటీమ్‌లోనే.. కెప్టెన్‌గా ధోని!

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఒకటి. ప్రతీ క్రికెటర్ ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాలని కలలు కంటాడు. ఇక ఈ లీగ్ యువ ఆటగాళ్లకు మంచి వేదిక. ఎందరో అనామక ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లయ్యారు. కోట్లు కొల్లగొట్టారు.
ఇలా ప్రతీ ఏడాది రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. 2020 సీజన్‌కు ముస్తాబువుతోంది. మార్చి 29 నుంచి మే 24 వరకు సందడి చేయబోతుంది. అయితే ఈ సారి కాలంతో మారిన ఆటతో కనువిందు చేయనుంది. కొత్తగా నోబాల్ అంపైర్.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌తో రాబోతుంది.
ఇక టైమింగ్‌లో మార్పు ఉంటుందని భావించినా.. ఈప్రతిపాదనపై గత సోమవారం సుదీర్ఘంగా చర్చించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మ్యాచ్‌లు యధావిధిగా రాత్రి 8 గంటలకే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాకపోతే అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్న విధంగా 'కంకషన్ సబ్‌స్టిట్యూట్'ను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నోబాల్స్‌ను మాత్రమే చూసేందుకు ఒక టీవీ అంపైర్‌ను ప్రత్యేకంగా నియమిస్తున్నారు.
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తుంది. అయితే ఈసారి మొత్తం షెడ్యూల్‌లో రెండు మ్యాచ్‌లు జరిగే (సాయంత్రం 4 గం.; రాత్రి 8 గం.) రోజులను తగ్గించారు. వీటిని ఐదుకు మాత్రమే పరిమితం చేశారు. ఐపీఎల్ ప్రారంభానికి మూడు రోజుల ముందు ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లతో కలిసి సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం 'ఆల్ స్టార్స్ మ్యాచ్' నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇదే అభిమానులకు హాట్ టాపిక్ అయింది. ఈ ఆల్ స్టార్ మ్యాచ్ ఏంటి? దీని ఫార్మాట్ ఏంటి? ఎలా ఆడుతారని ఫ్యాన్స్‌కు ఉన్న అనేక సందేహాలపై ఓ లుక్కెద్దాం.

ఆల్ స్టార్ గేమ్ అంటే..?
ఈ ఆల్ స్టార్ గేమ్ కాన్సెప్ట్ ఐపీఎల్‌కు కొత్త. కానీ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) ఈ తరహా మ్యాచ్‌లను ఎక్కువగా నిర్వహిస్తుంది. ఇక క్రికెట్‌లో వరల్డ్ ఎలెవన్ , ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇతరహా కాన్సెప్ట్‌కు చెందినవే. ఆసియా దేశాల్లోని ఆటగాళ్లంతా ఒక జట్టైతే.. మిగతా ప్రపంచ ఆటగాళ్లంత మరో జట్టుగా తలపడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ టీమ్‌ల్లోని అన్ని జట్ల ఆటగాళ్లు సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ టీమ్‌లుగా విడిపోయి ఆడనున్నారు. అభిమానులకు కావాల్సిన మజా ఇవ్వనున్నారు.

ధోని, కోహ్లీ, రోహిత్ ఒకేటీమ్‌లో..
ఐపీఎల్‌లోని మొత్తం 8 జట్ల ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక గ్రూప్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఉండనుండగా.. రెండో గ్రూప్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు ఉండనున్నారు. ఇలా నాలుగు జట్లలోని కీలక ఆటగాళ్లతో తుది జట్లుగా బరిలోకి దిగి పోటీపడనున్నారు. దీంతో టీమిండియా లెజండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే జట్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు జస్ప్రిత్ బుమ్రా, విలియమ్సన్, రషీద్ ఖాన్‌లు కూడా ఉండనున్నారు. మరో జట్టు కూడా కేఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, అశ్విన్, ఆర్చర్, అయ్యర్, రిషబ్ పంత్‌లతో ధీటుగా ఉండనుంది.

సారథులు ధోని, స్మిత్
విరాట్, రోహిత్ ఉన్న కూడా అనుభవం దృష్ట్యా సౌత్ వెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా ధోనినే కొనసాగే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ టీమ్ కెప్టెన్సీకి స్టీవ్ స్మిత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య పోటీ ఉన్నా.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కే జట్టు పగ్గాలు అందొచ్చు. ఏదీ ఏమైనా ఈ ఆల్ స్టార్ మ్యాచ్‌తో అభిమానులకు కావాల్సిన మజా.. బోర్డు కావాల్సిన విరాళాలు పుష్కలంగా రానున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications