Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH గురించి తెలియని ఆసక్తికర విషయాలు.. కేన్ మామ కన్నా మనీష్ పాండే ధర మూడున్నర రెట్లు ఎక్కువ!

 IPL: 4 Unknown facts about Sunrisers Hyderabad
SRH ఆరెంజ్ ఆర్మీ స్టైల్.. తక్కువ ధరకే విలువైన ఆటగాళ్లు Interesting Facts || Oneindia Telugu

హైదరాబాద్: ఆడింది ఏనిమిది సీజన్లు.. ఓ సారి చాంపియన్‌షిప్.. ఇంకోసారి రన్నరప్.. నాలుగు సార్లు ప్లే ఆఫ్స్.. ఇంకో రెండు సార్లు ఆరో స్థానం... ఐపీఎల్‌లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానమిది. చూస్తుండగానే పాయింట్ల పట్టికలో పైకెళ్లడం.. చడీచప్పుడు లేకుండా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లడం ఆ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య.

జట్టును నడిపించేది ఎవరైనా పెర్ఫామెన్స్‌లో తేడా ఉండదు. టీమ్ బ్యాలెన్స్‌లో మార్పు కనిపించదు. రెండు వైపులా పదునున్న కత్తిలా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్‌లో ఇరగదీసి ప్రత్య్రర్థి తలవంచడం ఆరెంజ్ ఆర్మీ స్టైల్.. దాంతో ధనాధన్ లీగ్‌లో నిలకడకు మారుపేరుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ జట్టుకు సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

రూ. 85.05 కోట్లకు కొన్న సన్‌నెట్‌వర్క్స్..

రూ. 85.05 కోట్లకు కొన్న సన్‌నెట్‌వర్క్స్..

హైదరాబాద్ బేస్ ఫ్రాంచైజీగా ఉన్న డెక్కన్ చార్జెస్ టీమ్‌ను 2012లో సన్‌నెట్ వర్క్ సంస్థ రూ.85.05(12 మిలియన్లు యూఎస్ డాలర్లు)కు కొనుగోలు చేసింది. 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌గా బరిలోకి దిగింది. అరంగేట్ర సీజన్‌తో తొలి తొమ్మిది మ్యాచ్‌లకు కుమార సంగక్కర సారథ్యం వహించగా.. తదుపరి ఏడు మ్యాచ్‌ల్లో కామెరూన్ వైట్ నడిపించాడు. ఆ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తదుపరి సీజన్‌లో 6వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో తొలి 10 మ్యాచ్‌లకు శిఖర్ ధావన్ సారథ్యం వహించగా.. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో డారెన్ సామి జట్టును నడిపించాడు.

రూ. 5 కోట్లకు వార్నర్..

రూ. 5 కోట్లకు వార్నర్..

2015 సీజన్‌లో 13 మందిని రీటైన్ చేసుకున్న హైదరాబాద్.. 11 మందిని వదిలేసింది. ఇక అప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన డేవిడ్ వార్నర్‌ను కేవలం రూ. 5 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. అయినా ఆ సీజన్‌లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరలేదు. ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓడి ఆరో ప్లేస్‌తో సరిపెట్టుకుంది.

ఈ సీజన్‌లో బ్యాట్‌తో దుమ్మురేపిన వార్నర్.. ఫస్ట్ టైమ్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. తదుపరి సీజన్‌లోను అదే జోరు కొనసాగించిన వార్నర్.. భువనేశ్వర్ బౌలింగ్ సాయంతో జట్టుకు టైటిల్ అందించాడు. వార్నర్ 500కు పైగా పరుగులు చేయగా.. భువీ హైదరాబాద్ తరఫున తొలిసారి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

మనీష్ పాండేకు రూ.11 కోట్లు..

మనీష్ పాండేకు రూ.11 కోట్లు..

2018 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకొని అందరిని రిలీజ్ చేసింది. మనీష్ పాండేను రూ.11 కోట్లు భారీ ధర వెచ్చించిన సన్‌రైజర్స్.. కేన్ విలియమ్సన్‌ను కేవలం 3 కోట్లకు మాత్రమే కొనుగోలు చేసింది. 2015 నుంచి కేన్ ఆడుతునప్పటికీ లీగ్ తనదైన మార్క్ చూపించలేకపోయాడు. దాంతో అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.

దాంతో ఆరెంజ్ ఆర్మీ చాలా తక్కువ ధరకు కేన్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు మనీష్ పాండే అప్పటికే ఓ సెంచరీ బాది.. ఐపీఎల్ ప్లేయర్‌గా గుర్తింపు పొందడంతో భారీ ధర పలికాడు. ఈ సీజన్‌కు నిషేధం కారణంగా వార్నర్ దూరమవడంతో కేన్ మామనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఒంటి చేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కేన్ విలియమ్సన్ 735 రన్స్ చేయగా.. పాండే 284 రన్స్ మాత్రమే చేశాడు.

రూ.2.2 కోట్లకు బెయిర్ స్టో

రూ.2.2 కోట్లకు బెయిర్ స్టో

ఇక 2019 సీజన్‌లో శిఖర్ ధావన్‌ను ట్రేడింగ్ ద్వారా ఢిల్లీకి వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. కొత్తగా ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ జానీ బెయిర్ స్టోను తీసుకుంది. ఆశ్చర్యకరంగా వేలంలో అతన్ని రూ.2.2 కోట్లకే సొంతం చేసుకుంది. కానీ జానీ బెయిర్ స్టో ఎంత విలువైన ఆటగాడో నిరూపించాడు. ఆ సీజన్‌లో వార్నర్‌తో కలిసి అతను సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు.

ఈ సీజన్‌లోనూ కేన్ మామనే కెప్టెన్సీ చేయగా.. భువీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వార్నర్ మరోసారి దుమ్మురేపడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరింది. కానీ ఢిల్లీ చేతిలో ఓడి ఇంటిదారిపట్టింది. సన్‌రైజర్స్ తరఫున రాణించే కేన్, బెయిర్ స్టో‌లు పలికిన ధరను చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వచ్చే ఏడాది మెగా వేలం జరిగితే వీళ్లు బారీ ధర పలకడం ఖాయం.

Story first published: Wednesday, May 19, 2021, 16:17 [IST]
Other articles published on May 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+