Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: సూర్యకుమార్ యాదవ్‌పై కన్నేసి ఆ మూడు ఫ్రాంచైజీలు!

టీమిండియా మాజీ టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆ జట్టును వీడనున్నాడనే వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పేలవ ఫామ్‌తో టీమిండియా టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయిన సూర్యను వదులుకునేందుకు ముంబై సిద్దమైందని వార్తలు వచ్చాయి. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసేందుకు ముంబై ప్రయత్నించినట్లు కూడా ప్రచారం జరిగింది. సూర్య నిష్క్రమణపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. అతను జట్టును వీడటం ఖాయమనిపిస్తోంది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ పేలవ ప్రదర్శన ముంబై ఇండియన్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. 13 మ్యాచ్‌ల్లో సూర్య రెండు హాఫ్ సెంచరీలతో 270 పరుగులే చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 717 పరుగులు చేసిన సూర్య ఆ జోరును కొనసాగించలేకపోయాడు. అంతేకాకుండా గత ఏడాదిన్నరగా సూర్య.. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా విఫలమయ్యాడు.

IPL 2027 These Three Franchises Could Target Suryakumar Yadav If Mumbai Indians Release Him

పేలవ ప్రదర్శనతో చివరకు కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఈ క్రమంలోనే అతన్ని వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్దమైందనే వాదన వినిపిస్తోంది. అయితే సూర్యను ముంబై వదిలేస్తే అతన్ని తీసుకునేందుకు మూడు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి.

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

1. కేకేఆర్..

సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకునే ఫ్రాంచైజీల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం సూర్య ఫామ్‌లో లేకపోయినా అతని అనుభవం, టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే బ్యాటింగ్ శైలి జట్టుకు ఉపయోగపడుతుందని కేకేఆర్ భావిస్తోంది. అంతేకాకుండా కేకేఆర్‌కు కెప్టెన్ అవసరం ఉంది. సూర్యను తీసుకుంటే కెప్టెన్సీతో పాటు మిడిలార్డర్ బ్యాటర్ లోటును తీర్చుకోవచ్చని భావిస్తోంది. అవసరమైతో సూర్య కోసం ముంబైతో కేకేఆర్ ట్రేడ్ డీల్స్ జరపనుంది. వేలంలోకి వచ్చినా కోట్ల రూపయాలను కుమ్మరించనుంది.

2. లక్నో సూపర్ జెయింట్స్

సూర్యకుమార్ యాదవ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ కూడా పోటీపడనుంది. అయితే అతని కోసం తమ స్టార్ ఆటగాళ్లను వదులుకునేందుకు లక్నో సిద్దంగా లేదు. ఈ క్రమంలోనే ముంబైతో ట్రేడ్ డీల్‌కు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ సూర్య వేలంలోకి వస్తే అతన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయనుంది. ఎందుకంటే లక్నోకు కూడా కెప్టెన్సీతో పాటు ఓ ఇండియన్ మిడిలార్డర్ బ్యాటర్ అవసరం ఉంది.

IND vs SL: ధ్రువ్ జురెల్‌కు బదులు అతన్ని ఆడించండి: మహమ్మద్ కైఫ్

Also Read

IND vs SL: ధ్రువ్ జురెల్‌కు బదులు అతన్ని ఆడించండి: మహమ్మద్ కైఫ్

3. రాజస్థాన్ రాయల్స్..

సూర్య కోసం రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీ పడనుంది. అవసరమైతే ముంబై ఇండియన్స్‌తో ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు కూడా చేయవచ్చు. సూర్య కోసం యశస్వి జైస్వాల్‌ను కూడా వదులుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్దంగా ఉంది. టాప్ క్లాస్ ఇండియన్ మిడిలార్డర్ బ్యాటర్ అవసరం ఆ జట్టుకు ఉంది. అంతకంటే అనుభవం కలిగిన సారథి ఆ జట్టుకు కావాలి. సూర్య రాకతో ఈ రెండు సమస్యలను అధిగమించవచ్చని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది.

Story first published: Wednesday, August 12, 2026, 17:25 [IST]
Other articles published on Aug 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+