సీఎస్‌కేలోకి హార్దిక్ పాండ్యా, బెన్ స్టోక్స్..!
ఐపీఎల్ 2027 సీజన్ వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) డ్రీమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఈ జట్టులో ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌లకు అవకాశం కల్పించాడు. ప్రస్తుతం ఈ డ్రీమ్ ఎలెవన్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తీవ్రంగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆ జట్టును వీడేందుకు హార్దిక్ పాండ్యా సిద్దమయ్యాడనే వార్తలు వస్తున్నాయి. దాంతో హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకునేందుకు 7 ఫ్రాంచైజీలు పోటీపడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా హార్దిక్ పాండ్యా కోసం పోటీపడుతుందని వార్తలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై స్పందించిన బద్రీనాథ్.. అంత సులువుగా హార్దిక్ పాండ్యాను ముంబై వదులుకోదని, బదులుగా సీఎస్‌కే నుంచి శివమ్ దూబేను అడుగుతుందని బద్రీనాథ్ అన్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బెన్ స్టోక్స్.. ఐపీఎల్ 2027 వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. స్టోక్స్ కోసం సీఎస్‌కే తీవ్రంగా ప్రయత్నించి కొనుగోలు చేయవచ్చని బద్రీనాథ్ అన్నాడు. ఒకవేళ సీఎస్‌కే జట్టు హార్దిక్ పాండ్యాతో పాటు బెన్ స్టోక్స్ తీసుకుంటే అది డ్రీమ్ ఎలెవెన్ అవుతుందని అభిప్రాయపడ్డాడు.
అయితే సీఎస్‌కే కంటే కేకేఆర్ టీమ్‌కు హార్దిక్ పాండ్యాకు అవసరం ఉందని చెప్పాడు. కోల్‌కతా జట్టుకు ప్రస్తుతం మంచి ఆల్‌రౌండర్‌తో పాటు కెప్టెన్, సీనియర్ ప్లేయర్ అవసరం ఉందని, హార్దిక్ పాండ్యా సరైన ఎంపిక అవుతాడని తెలిపాడు. ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని జట్లు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని చెప్పాడు.
బద్రీనాథ్ సీఎస్‌కే డ్రీమ్ ఎలెవన్: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications