Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రీఎంట్రీ.. రిషభ్ పంత్ రియాక్షన్ ఇదే!

లక్నో సూపర్ జెయింట్స్‌తో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ ప్రయాణం రెండేళ్లకే ముగిసింది. రిషభ్ పంత్ తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ ట్రేడింగ్ స్వాప్ డీల్ ద్వారా రూ.15 కోట్లకు రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అందుకు బదులుగా తమ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను రూ.13.50 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇచ్చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద స్వాప్ డీల్‌గా ఇది మిగిలిపోయింది.

IPL 2027: హార్దిక్ పాండ్యాపై కన్నేసిన ఆ రెండు ఫ్రాంచైజీలు!

IPL 2027: హార్దిక్ పాండ్యాపై కన్నేసిన ఆ రెండు ఫ్రాంచైజీలు!

ఈ స్వాప్ డీల్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిషభ్ పంత్ స్పందించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కుధన్యవాదాలు తెలిపాడు. సింపుల్‌గా 'థ్యాంక్యూ టీమ్'అని పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషభ్ పంత్ సుదీర్ఘ కాలం ఆడాడు. 2016-2024 వరకు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2021-2024 మధ్య 43 మ్యాచ్‌ల్లో ఢిల్లీ ఫ్రాంచైజీకి సారథిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు.

IPL 2027 Rishabh Pant Breaks Silence With Classy Three-Word Farewell to LSG After Historic Delhi Capitals Return

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతని సారథ్యంలో వరుసగా రెండు సీజన్లు ఆడిన లక్నోసూపర్ జెయింట్స్ దారుణంగా విఫలమైంది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దాంతో రిషభ్ పంత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి లక్నో తప్పించింది. రిషభ్ పంతే స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని ప్రకటించింది.

కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే నేను ఎదుర్కొన్న కఠినమైన బ్యాటర్: జోఫ్రా ఆర్చర్

కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే నేను ఎదుర్కొన్న కఠినమైన బ్యాటర్: జోఫ్రా ఆర్చర్

సీజన్ ఆరంభంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా రిషభ్ పంత్‌ను మందలించడం కూడా కనిపించింది. ఆ జట్టు మేనేజ్‌మెంట్‌తో విభేదాలు తలెత్తడంతోనే పంత్ తిరిగి ఢిల్లీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. తన పాత ఫ్రాంచైజీలోకి తిరిగి వెళ్లేందుకు పంత్ తన ధరను ఏకంగా రూ.12 కోట్లు తగ్గించుకున్నాడు.

Story first published: Wednesday, June 24, 2026, 16:20 [IST]
Other articles published on Jun 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+