IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషభ్ పంత్.. లక్నోకు కుల్దీప్ యాదవ్!
లక్నో సూపర్ జెయింట్స్(LSG) సారథ్య బాధ్యతలు కోల్పోయిన రిషభ్ పంత్ తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నోసూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్‌లకు 4 మాత్రమే గెలిచిన లక్నో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగుస్థానంలో నిలిచింది.
ఈ సీజన్ ముగిసిన వెంటనే సారథ్య బాధ్యతల నుంచి రిషభ్ పంత్ తప్పుకున్నాడని, అతనే ఈ నిర్ణయం తీసుకున్నాడని లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. లక్నో జట్టులో చేరిన తర్వాత రిషభ్ పంత్ వ్యక్తిగత ప్రదర్శన కూడా దెబ్బతిన్నది. లక్నో ఫ్రాంచైజీ వర్గాలు కూడా రిషభ్ పంత్ ఆట పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ వైపు చూస్తున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పటికే ఈ విషయంపై లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాను వివరణ కోరామని, ఆయన ఇంకా స్పందించలేదని తమ కథనంలో రాసుకొచ్చింది.
రూ.27 కోట్లు పలికి..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ గుర్తింపు పొందాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే అత్యధిక ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడినో లేక మరే కారణమో తెలియదు కానీ రెండు సీజన్లలో రిషభ్ పంత్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో 269, ఐపీఎల్ 2026 సీజన్‌లో 312 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్‌గా విఫలమైన అతను కెప్టెన్‌గానూ తడబడ్డాడు.

ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. లీగ్ ఆరంభంలో రిషభ్ పంత్‌ను సంజీవ్ గోయెంకా మందలించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణమాల నేపథ్యంలోనే రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడేందుకు సిద్దమయ్యాడనే వార్తలు హల్‌ఛల్ చేస్తున్నాయి.
కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు రీఎంట్రీ ఇచ్చినా సారథిగా కొనసాగేందుకు రిషభ్ పంత్ సుముఖంగా లేడని, కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమించేందుకు ఫ్రాంచైజీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లోనే ఈ నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగినా.. అది జరగలేదు. ఐపీఎల్ 2027 సీజన్‌లో కేఎల్ రాహుల్ ఢిల్లీని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ.13.25 కోట్ల భారీ ధరకు కుల్దీప్ యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2022లో ఢిల్లీలో చేరిన కుల్దీప్.. 21 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత 10, 16, 15, 10 వికెట్లతో నిరాశపర్చాడు. కుల్దీప్ యాదవ్‌ను వదులుకునేందుకు ఢిల్లీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

