Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెనే సీఎస్‌కే హెడ్ కోచ్‌: అశ్విన్

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. వచ్చే వారం ఇయాన్ మోర్గాన్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడనుందని అశ్విన్ తెలిపాడు.

2027 వన్డే ప్రపంచకప్‌కు పంత్, షమీ అవసరం లేదు.. కానీ ఆ 36 ఏళ్ల బౌలర్‌ను తీసుకోవాలి: అశ్విన్

2027 వన్డే ప్రపంచకప్‌కు పంత్, షమీ అవసరం లేదు.. కానీ ఆ 36 ఏళ్ల బౌలర్‌ను తీసుకోవాలి: అశ్విన్

18 ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా సేవలు అందించిన స్టీఫెన్ ఫ్లేమింగ్ ఇటీవలే తన బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. సీఎస్‌కే నుంచి వైదొలిగిన ఫ్లెమింగ్ ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దాంతో సీఎస్‌కే తదుపరి హెడ్ కోచ్ ఎవరా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. మహేంద్ర సింగ్ ధోనీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

IPL 2027 R Ashwin Drops Major Hint Says Eoin Morgan Could Become CSK s Next Head Coach

ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. ఆశ్చర్యకరంగా ఇయాన్ మోర్గాన్ పేరును ప్రస్తావించాడు. 'నాకు తెలిసిన వర్గాల సమాచారం ప్రకారం సీఎస్‌కే హెడ్ కోచ్ పదవికి ఇయాన్ మోర్గాన్ పేరు వినిపిస్తోంది. వచ్చే వారంలో మోర్గాన్ నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని మహేంద్ర సింగ్ ధోనీకి వదిలేసినట్లు నాకు అనిపిస్తుంది. అయితే ఇయాన్ మోర్గాన్ నియమాకం సరైందే. ఎందుకంటే మెగా ఆక్షన్‌కు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఫ్లెమింగ్ స్థానంలో మరొకరిని ఎంచుకోవడం ఇప్పటికే ఆలస్యమైంది.

ఇయాన్ మోర్గాన్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడితే.. నాథన్ లేమన్ సపోర్ట్ స్టాఫ్‌లో చేరనున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా మోర్గాన్ ఉన్న సమయంలో నాథన్ లేమన్ డేటా అనలిస్ట్‌గా పని చేశారు. ఇయాన్ మోర్గాన్ కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ అతను ఆ జట్టులో చేరాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

Also Read

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

అయితే ఇయాన్ మోర్గాన్‌కు హెడ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో అతనికి అపారమైన అనుభవం ఉంది. 2019 వన్డే ప్రపంచకప్‌ అందించి ఇంగ్లండ్ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాడు. ఐపీఎల్‌లో తన సారథ్యంలో కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

Story first published: Thursday, August 13, 2026, 10:53 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+