IPL 2027: అతన్ని ఇచ్చి హార్దిక్‌ను తీసుకోండి.. రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై బేరం!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసి నెల రోజులు కూడా పూర్తికాకముందే ఆటగాళ్ల ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీలు ప్రయత్నాలను మొదలు పెట్టాయి. ఐపీఎల్ 2027 సీజన్ కోసం తమ జట్లను బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ఓపెన్ కావడంతో తమకు కావాల్సిన ప్లేయర్ల కోసం బేరాలు మొదలు పెట్టాయి.
ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే హార్దిక్ పాండ్యా ఈ విషయాన్ని ఫ్రాంచైజీకి తెలియజేశాడని, ముంబై మేనేజ్‌మెంట్ కూడా ఒప్పుకుందని ప్రచారం జరిగింది.
హార్దిక్ కోసం రాజస్థాన్ రాయల్స్..
అయితే తాజా సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసేందుకు ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యాను ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసిన ముంబై ఇండియన్స్.. అందుకు ప్రతీగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌ను వీడేందుకు యశస్వి రెడీ..
యశస్వి జైస్వాల్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులో సౌకర్యంగా ఉన్నట్లు కనిపించడం లేదు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో యశస్వి జైస్వాల్ అనవసర ఒత్తిడికి గురవుతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వైభవ్ సూర్యవంశీ ధాటికి యశస్వి జైస్వాల్‌కు తగిన గుర్తింపు కూడా దక్కడం లేదు.
ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా రాజస్థాన్ రాయల్స్‌ను యశస్వి జైస్వాల్ వీడాలని వీరేంద్ర సెహ్వాగ్, అంబటి రాయుడు వంటి మాజీ క్రికెటర్లు సూచించారు. ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లే అవకాశం వస్తే యశస్వి జైస్వాల్ కళ్లు మూసుకొని వెళ్లనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకే ఆడే యశస్వి జైస్వాల్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌లో చేరితే తన కెరీర్ మళ్లీ ట్రాక్‌లో పడే అవకాశం ఉంది.
రాజస్థాన్‌తో ముంబై బేరం..
ఓ క్రికెట్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. హార్దిక్ పాండ్యా కోసం ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ సంప్రదింపులు జరుపుతుందంట. అయితే హార్దిక్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న ముంబై ఇండియన్స్.. యశస్వి జైస్వాల్‌ను ఇవ్వాలని కోరుతుందంట. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య చర్చలు జరుగుతున్నాయని సదరు వెబ్‌సైట్ పేర్కొంది.
సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్‌ను విడిచి పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లను వదిలించుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. సూర్య కోసం రెండు ఉత్తరాది ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయని, కెప్టెన్సీ ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నయా సూపర్ స్టార్ కోసం..
రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉండగా.. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టును వీడేందుకు సిద్దం కావడంతో కొత్త సూపర్ స్టార్‌ను తయారు చేయడంపై ముంబై ఇండియన్స్ ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతోంది. ఈ క్రమంలోనే జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న యువ ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్‌కు మాత్రమే మూడు ఫార్మాట్లు ఆడగలిగే సత్తా ఉంది. అవసరమైతే యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు కూడా ముంబై ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

