Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ఆ యువ ఓపెనర్‌పై కన్నేసి ముంబై ఇండియన్స్!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు తమ జట్లను బలోపేతం చేయడంపై ఫ్రాంచైజీలు దృష్టిసారించాయి. ప్లేయర్స్ ట్రేడింగ్ విండో ఓపెన్ కావడంతో ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం బేరసారాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ స్వాప్ డీల్‌ను పూర్తి చేసుకున్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వగా.. అందుకు ప్రతీగా కుల్దీప్ యాదవ్‌ లక్నో టీమ్‌లోకి వెళ్లిపోయాడు. ఈ స్వాప్ డీల్ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ స్వాప్ డీల్ నేపథ్యంలో మరో బిగ్ డీల్ గురించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది.

ఐపీఎల్ స్వాప్ డీల్.. ఢిల్లీకి రిషభ్ పంత్! సగం ధర తగ్గించుకోని..!

ఐపీఎల్ స్వాప్ డీల్.. ఢిల్లీకి రిషభ్ పంత్! సగం ధర తగ్గించుకోని..!

యువ ఓపెనర్ కోసం..

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై ముంబై ఇండియన్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు సిద్దమైన హార్దిక్ పాండ్యా కోసం రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్లేయర్ ట్రేడ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు ముంబై ఇండియన్స్‌ను రాజస్థాన్ రాయల్స్ సంప్రదించినట్లు ఓ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది.

IPL 2027 Mumbai Indians Eye Rajasthan Royals Opener for Future Plans Amid Hardik Pandya Exit

అయితే ఇదు అదునుగా భావించిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాకు బదులుగా యశస్వి జైస్వాల్‌ను ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్‌ను అడగడంతో రాజస్థాన్ రాయల్స్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు‌ను వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.


వైభవ్‌ దెబ్బకు..

టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో యశస్వి జైస్వాల్ అనవసర ఒత్తిడికి గురవుతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వైభవ్ సూర్యవంశీ ధాటికి యశస్వి జైస్వాల్‌కు తగిన గుర్తింపు కూడా దక్కడం లేదు.

ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా రాజస్థాన్ రాయల్స్‌ను యశస్వి జైస్వాల్ వీడాలని వీరేంద్ర సెహ్వాగ్, అంబటి రాయుడు వంటి మాజీ క్రికెటర్లు సూచించారు. ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లే అవకాశం వస్తే యశస్వి జైస్వాల్ కళ్లు మూసుకొని వెళ్తాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకే ఆడే యశస్వి జైస్వాల్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌లో చేరితే అతని విలువు రెట్టింపు కానుంది.

IPL 2027: అతన్ని ఇచ్చి హార్దిక్‌ను తీసుకోండి.. రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై బేరం!

IPL 2027: అతన్ని ఇచ్చి హార్దిక్‌ను తీసుకోండి.. రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై బేరం!

నయా సూపర్ స్టార్ కోసం..

రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉండగా.. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టును వీడేందుకు సిద్దం కావడంతో కొత్త సూపర్ స్టార్‌ను తయారు చేయడంపై ముంబై ఇండియన్స్ ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతోంది. ఈ క్రమంలోనే జైస్వాల్‌‌కు ముంబై ఇండియన్స్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న యువ ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్‌కు మాత్రమే మూడు ఫార్మాట్లు ఆడగలిగే సత్తా ఉంది. అవసరమైతే యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు కూడా ముంబై ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, June 23, 2026, 16:40 [IST]
Other articles published on Jun 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+