Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్ వర్మ!

ఐపీఎల్ 2027 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌‌ను నయా సారథి నడిపించే అవకాశం ఉంది. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఫ్రాంచైజీని వదిలేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో భారత జట్టుకు దూరమయ్యాడు. రోహిత్ శర్మ కూడా కెరీర్ చివరి దశలో ఉన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌తో రోహిత్ క్రికెట్ ప్రస్థానం ముగియనుంది.

ఈ క్రమంలోనే నయా సారథిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ముంబై ఇండియన్స్‌కు ఏర్పడింది. నయా సారథి కోసం తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రాల పేర్లను ముంబై ఇండియన్స్ యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కెప్టెన్‌ను ఎంపిక చేయాలని ముంబై మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

IND vs ENG: కోహ్లీపై వేటు.. ఇంగ్లండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: కోహ్లీపై వేటు.. ఇంగ్లండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

23 ఏళ్ల తిలక్ వర్మ‌ vs 32 ఏళ్ల బుమ్రా ..

అందుకు తిలక్ వర్మనే సరైనవాడని అనుకుంటుంది. ప్రస్తుతం టీమిండియా టీ20 వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న తిలక్ వర్మ.. మెరుగైన ప్రదర్శన కనబర్చితే భవిష్యత్తులో టీమిండియా సారథ్య బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉంది. తిలక్ వర్మ వయసు 23 ఏళ్ల కావడం కూడా అతనికి కలిసొచ్చే అవకాశం. మరో 10 ఏళ్ల పాటు అతను అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగనున్నాడు. అయితే తిలక్ వర్మకు జస్‌ప్రీత్ బుమ్రా నుంచి తీవ్ర పోటీ నెలకొంది.

IPL 2027 Jasprit Bumrah and Tilak Varma Emerge as Leading Contenders for Mumbai Indians Captaincy Reports

32 ఏళ్ల బుమ్రా టీమ్ కెప్టెన్సీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు కెప్టెన్సీపై తనకు ఉన్న కోరికను బయటపెట్టుకున్నాడు. టీమిండియా సారథిగా కూడా కొనసాగాలనుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ కూడా చేపట్టాడు. కానీ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఆ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. ఈ క్రమంలోనే కనీసం ఐపీఎల్‌లోనైనా కెప్టెన్సీ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. తనకు కెప్టెన్సీ ఇవ్వకుండా తిలక్ వర్మకు ఇస్తే బుమ్రా జట్టును వీడే అవకాశం కూడా ఉంది. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం.. ఇక అక్కడే మకాం!

హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం.. ఇక అక్కడే మకాం!

హార్దిక్ కోసం పోటీపడుతున్న ఫ్రాంచైజీలు..

ముంబై ఇండియన్స్‌కు సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ సారథ్యం వహించినా.. రోహిత్ శర్మనే ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగాడు. అతని సారథ్యంలోనే ముంబై ఐదు టైటిళ్లు గెలిచింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ముంబై ఇండియన్స్‌కు నష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని అభిమానులతో పాటు జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు.

దాంతో హార్దిక్‌కు అన్ని వైపుల నుంచి సహకారం కొరవడింది. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడి‌కి గురైన హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కు సమాచారం ఇచ్చాడు. ఇతర ఫ్రాంచైజీలు హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రాజస్థాన్ రాయల్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్రంగా పోటీపడుతున్నాయి. హార్దిక్ కోసం తమ స్టార్ ఆటగాళ్లను వదులుకునేందుకు కూడా ఆ ఫ్రాంచైజీలు సిద్దంగా ఉన్నాయి.

Story first published: Wednesday, July 15, 2026, 14:58 [IST]
Other articles published on Jul 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+