Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి హార్దిక్ పాండ్యా?

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ హాట్ టాపిక్‌గా మారింది. హార్దిక్ ట్రేడింగ్ గురించి పూటకో వార్త తెరపైకి వస్తుంది. పేలవ ప్రదర్శన నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు హార్దిక్ పాండ్యా సిద్దమవ్వగా.. అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

మరోవైపు హార్దిక్ పాండ్యాను అడ్డుపెట్టుకొని తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఆయా ఫ్రాంచైజీలతో ముంబై ఇండియన్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రోజుకో ఫ్రాంచైజీలో హార్దిక్ పాండ్యా చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

IPL 2027: హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌లో బిగ్ ట్విస్ట్.. ఛీ కొట్టిన ఫ్రాంచైజీ!

IPL 2027: హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌లో బిగ్ ట్విస్ట్.. ఛీ కొట్టిన ఫ్రాంచైజీ!

కెప్టెన్సీ అడగడంతో..

ముందుగా చెన్నై సూపర్ కింగ్స్‌తో హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్స్ జరిపిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్‌తో చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. హార్దిక్ పాండ్యా తన పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడని, అతన్ని తీసుకునేందుకు ఆఫ్రాంచైజీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అడగడంతో అతని ట్రేడ్ డీల్‌‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

IPL 2027 Hardik Pandya to Join Delhi Capitals DC s Cryptic Post Sparks HUGE Trade Buzz

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోకి చేరేందుకు హార్దిక్ పాండ్యా సిద్దమయ్యాడని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఎక్స్‌ వేదికగా హార్దిక్ పాండ్యా ఫొటోను ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. గాయంతో భారత జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సీఓఈలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి కష్టపడుతున్నాడు.

మిన్న మణితో ఫొటో..

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు ఆల్‌రౌండర్ మిన్ను మణి కూడా సీఓఈలోనే రిహాబిలిటేషన్ తీసుకుంటుంది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న హార్దిక్ పాండ్యాతో కలిసి ఫొటో దిగింది. ఈ ఫొటోను ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్‌ వేదికగా పంచుకుంది. 'ఇద్దరు భారత ఆల్‌రౌండర్లు కలుసుకున్నారు'అని క్యాప్షన్‌‌గా పేర్కొంది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోకి చేరేందుకు హార్దిక్ పాండ్యా సిద్దమయ్యాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

IND vs SL: భారత్‌తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ఇదే!

Also Read

IND vs SL: భారత్‌తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ఇదే!

ఒకవేళ హార్దిక్ పాండ్యా ఢిల్లీకి ట్రేడ్ అయితే అతనికి బదులు కేఎల్ రాహుల్‌తో పాటు ఓ బౌలర్‌ను ముంబై అడగవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుభవం కలిగిన కెప్టెన్ అవసరం ఉంది. హార్దిక్ పాండ్యాతో ఆ లోటును తీర్చుకోవాలనే యోచనలో ఢిల్లీ ఉంది. హార్దిక్ పాండ్యా అరంగేట్ర సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిందని, గుజరాత్ టైటాన్స్‌కు కూడా అతను టైటిల్ అందించాడని, ఇప్పుడు ఢిల్లీకి అందివ్వబోతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Wednesday, August 12, 2026, 17:49 [IST]
Other articles published on Aug 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+