Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త కెప్టెన్.. రుతురాజ్ గైక్వాడ్‌పై వేటు!

ఐపీఎల్ 2027 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి రుతరాజ్ గైక్వాడ్‌ను తప్పించి కొత్త కెప్టెన్‌ను నియమించాలనే యోచనలో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ 2023 సీజన్‌లో చివరిసారిగా విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత వరుసగా మూడు సీజన్లలో దారుణంగా విఫలమైంది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది.

IPL 2026: ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్!

IPL 2026: ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ బంపరాఫర్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో తృటిలో ప్లే ఆఫ్స్ బెర్త్ కోల్పోయిన సీఎస్‌కే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మూడు సీజన్లలోనూ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించాడు. అతని సారథ్యంలో సీఎస్‌కే గొప్ప ప్రదర్శనలు చేయకపోవడంతో.. కెప్టెన్‌ను మార్చాలని సీఎస్‌కే నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.

IPL 2027 Chennai Super Kings Set for Captaincy Change Fans Back Sanju Samson

ఇదే నిజమైతే.. సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి సంజూ శాంసన్ మంచి ఆప్షన్ అని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటడంతో పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఎన్నో విజయాలు అందించాడని గుర్తు చేస్తున్నారు.

సంజూ కెప్టెన్సీ రికార్డ్ అద్భుతం..

రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ 33 మ్యాచ్‌లు ఆడి 14 మాత్రమే గెలిచింది. మరో 19 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రుతురాజ్ గైక్వాడ్.. సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. మరోవైపు సంజూ శాంసన్‌ సారథ్యంలో 67 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 33 గెలిచి 32 ఓడింది. మరో 2 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు.

ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్ చేర్చిన సంజూ.. 2024లో క్వాలిఫయర్-2కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే సంజూను కెప్టెన్‌గా నియమించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. గతేడాదే సంజూ.. ప్లేయర్ స్వాప్ ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్‌కేకు వచ్చాడు. సీఎస్‌కే తరఫున తన తొలి సీజన్‌లోనే 13 మ్యాచ్‌ల్లో 47.70 సగటుతో 477 పరుగులు చేశాడు.

రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్.. అతని కెప్టెన్సీలో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ కూడా చేరదు: సంజూ శాంసన్

Also Read

రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్.. అతని కెప్టెన్సీలో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ కూడా చేరదు: సంజూ శాంసన్

ధోనీ ఆడుతాడా..?

గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ.. అప్‌కమింగ్ సీజన్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ధోనీ ఆటగాడిగా కొనసాగుతాడా? లేక రిటైర్మెంట్ ప్రకటించి కోచ్‌గా బాధ్యతలు చేపడుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. 18 ఏళ్ల పాటు సీఎస్‌కేకు హెడ్ కోచ్‌గా సేవలు అందించిన స్టీఫెన్ ఫ్లేమింగ్ ఇటీవలే తన బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

దాంతో సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరా? అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు సీఎస్‌కేలో ధోనీ 22 శాతం వాట అడిగాడని, అందుకు ఫ్రాంచైజీ ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ కొట్టిపారేసింది.

Story first published: Saturday, September 5, 2026, 15:56 [IST]
Other articles published on Sep 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+