Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిక్కుల్లో చాహల్.. కోరికను ఆపుకోలేక విమానంలోనే..!

పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చిక్కుల్లో పడ్డాడు. దూమపానం అలవాటు ఉన్న చాహల్.. ఆ కోరికను ఆపుకోలేక విమానంలోనే ఈ సిగిరేట్(వేపింగ్) తాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. యుజ్వేంద్ర చాహల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు పంజాబ్ కింగ్స్ జట్టుతో ప్రయాణిస్తున్న సమయంలో వేపింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ విమానంలో ప్రయాణిస్తుండగా తన సహచరులతో కలిసి సరదాగా ఓ వీడియో చేశాడు. విండో సీటులో కూర్చున్న చాహల్.. పక్కన ఉన్న శశాంక్ సింగ్‌తో అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతుండగా.. తన చేయి అడ్డుపెట్టుకుని ఏదో నోటి దగ్గర పెట్టుకున్నట్లు కనిపించాడు.

IPL 2026 Yuzvendra Chahal Caught Vaping on Flight Viral Video Sparks Outrage and Safety Concerns

చాహల్ వేపింగ్ చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. చాహల్ వేపింగ్ దృశ్యాలు వైరల్ కావడంతో ఆ వీడియోను అర్ష్‌దీప్ సింగ్ ఎడిట్ చేసి మళ్లీ అప్‌లోడ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన రూల్స్ ప్రకారం విమానాల్లో ధూమపానం, వేపింగ్ నిషేధం. రూల్స్ ఉల్లంఘించి ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రయాణికులపై మిమానయాన సంస్థలు ఎలాంటి విచారణ లేకుండా తక్షణమే 30 రోజుల పాటు విమాన ప్రయాణ నిషేధాన్ని విధించే అధికారం ఉంది.

తక్షణమే నిషేధం విధించే అధికారం ఉన్నప్పటికీ ప్రయాణికుల దుష్ప్రవర్తనపై ఒక కమిటీని నియమించి వేపింగ్ చేసినట్లు నిర్ధారణ అయ్యేవరకు చర్యలు తీసుకోకపోవచ్చు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.

యుజ్వేంద్ర చాహల్.. కారు డ్రైవ్ చేస్తూ సిగరేట్ తాగిన వీడియో కూడా ఆ మధ్య వైరల్‌గా మారింది. ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మద్యానికి బానిసయ్యాడు. పీకల్‌దాక తాగి తూగుతూ వచ్చిన చాహల్ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ఓ చానెల్‌తో మాట్లాడిన చాహల్.. తాగడం పూర్తిగా మానేసానని చెప్పాడు. కానీ సిగరేట్ అలవాటు‌ను మానుకోలేకపోతున్నట్లు అర్థమవుతుంది. అందుకే ఈ సిగరేట్‌తో తన కోరికను తీర్చుకుంటున్నట్లు అర్థమవుతుంది.

Story first published: Thursday, May 7, 2026, 21:44 [IST]
Other articles published on May 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+