అందుకే రియాన్ పరాగ్‌ను పక్కనపెట్టాం: యశస్వి జైస్వాల్
తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతుండటంతోనే రియాన్ పరాగ్‌ను పక్కన పెట్టామని రాజస్థాన్ రాయల్స్ తాత్కలిక కెప్టెన్ యశస్వి జైస్వాల్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన యశస్వి జైస్వాల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోంది. పైగా మ్యాచ్ సాగుతున్న కొద్దీ మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు చాలా ప్రత్యేకం. ఎంతో గర్వంగా ఉంది. మా రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు తొడకండరాల గాయమైంది. త్వరలోనే అతను కోలుకుంటాడని ఆశిస్తున్నాను.

మా జట్టులో మూడు మార్పులు చేశాం. మా జట్టు మైండ్‌సెట్ బాగుంది. సానుకూల దృక్పథంతో ఈ మ్యాచ్ ఆడాలనుకుంటున్నాం. ముఖంపై చిరునవ్వుతో ఆటను ఆస్వాదించాలనుకుంటున్నాం. రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతనికి చిన్నపాటి నిగిల్ ఉంది.త్వరలోనే అతను కోలుకుంటాడు.'అని యశస్వి జైస్వాల్ తెలిపాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ధీమా వ్యక్తం చేశాడు. 'మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే వికెట్. ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా మాకు జరిగే నష్టం ఏం లేదు. మా ఫ్రాంచైజీ ఓనర్లు, అభిమానుల కోసం ఆడటం మాకు ఎంతో గర్వకారణం. ఎయిడెన్ మార్క్‌రమ్ వ్యక్తిగత కారణాల వల్ల ఇంటికి వెళ్ళాడు. షమీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతని స్థానంలో మొహ్‌సిన్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఎయిడెన్ మార్క్‌రమ్ స్థానంలో బదోని ఆడుతున్నాడు.’అని పంత్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్ (కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), డోనovan ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ శనక, జోఫ్రా ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, యష్ రాజ్ పుంజా.
లక్నో సూపర్ జాయింట్స్: మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ మహారాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications