Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా ఓటమికి కారణం అదే: యశస్వి జైస్వాల్

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ల అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే ఓటమిపాలయ్యామని రాజస్థాన్ రాయల్స్ నయా కెప్టెన్ యశస్వి జైస్వాల్ అన్నాడు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, గుజరాత్ టైటాన్స్ తమ కంటే మెరుగైన ప్రదర్శన చేయడంతోనే విజయం సాధించిందని చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జైపూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన యశస్వి జైస్వాల్.. ఈ మ్యాచ్ తమకు ఓ గుణపాఠమని తెలిపాడు. తమ ఓటమికి ప్రత్యేక కారణం ఏది లేదన్నాడు.

అడ్డుకునే ప్రయత్నం చేశాం..

'గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. మేం వారిని అడ్డుకోవడాన్ని ప్రయత్నించాం. మంచి ఏరియాల్లో బౌలింగ్ చేయడంతో పాటు బౌండరీలను అడ్డుకునే ప్రయత్నం చేశాం. కానీ వారు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ రోజు జోఫ్రా ఆర్చర్‌కు కలిసి రాలేదు. క్రికెట్‌లో ఇది సహజమే. కొన్ని రోజులు మనకు కలిసివస్తే.. మరికొన్ని రోజులు కలిసి రావు. మనం అనుకున్న విధంగా బౌలింగ్, బ్యాటింగ్ చేయలేం. కానీ ఆర్చర్ మా కోసం అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను మళ్లీ బలంగా పుంజుకుంటాడనే నమ్మకం నాకుంది.

IPL 2026 Yashasvi Jaiswal Defends Jofra Archer Credits GT s Batting After RR Heavy Defeat
Photo Credit: screen grab for JioHotstar

బట్లర్‌ను పక్కనపెట్టడం మా విజయవకాశాలను దెబ్బతీసిందా? అంటే.. నేను అంతగా ఆలోచించలేదు. నా దగ్గర ఒక సాధారణ ప్రణాళిక ఉంది. నా బౌలర్ ఎవరు? పవర్‌ప్లేలో నాకు మంచి ఓవర్లు ఎవరు వేయగలరు? అనే దానిపైన మాత్రమే దృష్టి పెట్టాను. అంతకు మించి ఏం లేదు. ఈ మ్యాచ్‌లో ప్రత్యేకంగా మేం ఏ తప్పు చేయలేదు. మేం ఏం చేస్తే ఇంకా మెరుగ్గా రాణించగలమో చూస్తాం. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకుని, తదుపరి మ్యాచ్ కోసం మేం ఏమి చేయగలం అనే దానిపై దృష్టి సారిస్తాం.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.

రఫ్ఫాడించిన రషీద్ ఖాన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. యష్‌రాజ్ పుంజా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రవీంద్ర జడేజా(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రషీద్ ఖాన్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. కగిసో రబాడ రెండు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్(3/12) మూడు వికెట్లు తీసాడు. మహమ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.

Story first published: Sunday, May 10, 2026, 0:02 [IST]
Other articles published on May 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+