Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs PBKS: 3 బంతుల్లో 2 వికెట్లు! రూ.25.20 కోట్లు దండుగ!

ల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్(6), స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(6) మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఇద్దరూ మూడు బంతుల వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు పంజాబ్ కింగ్స్ జేవియర్ బార్ట్‌లెట్ దిమ్మతిరిగే షాకిచ్చాడు.

రెండో ఓవర్‌లోనే ఫిన్ ‌అలెన్, కామెరూన్ గ్రీన్‌లను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. వరుసగా మూడు బంతులను షార్ట్ ఆఫ్ లెంగ్త్‌లో వేసిన బార్ట్‌లెట్.. నాలుగో బంతిని ఫుల్లిష్ డెలివరీ వేసి వికెట్ రాబట్టాడు. ఫిన్ అలెన్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ ప్రభ్‌సిమ్రాన్ చేతిలో పడింది. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ ఔట్ సైడ్ ఎడ్జ్‌తో లక్కీగా బౌండరీ రాబట్టాడు. కానీ ఆ మరుసటి బంతికే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

IPL 2026 Xavier Bartlett Double Strike Rattles KKR Fans Slam Rs 25 20 Crore Star Cameron Green After 2-Ball Collapse

దాంతో 16 పరుగులకే కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన అంగ్‌క్రిష్ రఘు వంశీతో రహానే ఆచితూచి ఆడాడు. అయితే 3.4 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో ఆట ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 3.4 ఓవర్లలో 25 పరుగులు చేసింది.

గ్రౌండ్స్‌మెన్ కవర్లతో మైదానాన్ని కప్పివేసారు. ప్రస్తుతం వర్షం పడుతూనే ఉంది. వర్షం ఆగితేనే మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడే పరిస్థితి ఉంటేనే మ్యాచ్ నిర్వహిస్తారు. లేదంటే రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. గతేడాది కూడా కోల్‌కతా వేదికగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవ్వగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. యాదృశ్చికమో ఏమో కానీ మళ్లీ ఇరు జట్ల మధ్య అదే ఈడెన్ గార్డెన్స్ వేదికగా వర్షం అంతరాయం కలిగిస్తోంది.

కామెరూన్ గ్రీన్ వైఫల్యం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన గ్రీన్.. జట్టుకు భారమయ్యాడని, అతనికి రూ.25 కోట్లు దండుగ అని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Monday, April 6, 2026, 20:46 [IST]
Other articles published on Apr 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+