IPL 2026: ఒరెయ్ నువ్వు మనిషివేనా.. పాపం బుడ్డోడు
ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీ లైన్‌పై అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో ఔరా అనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కొట్టిన భారీ సిక్సర్‌ను సూపర్ మాన్‌లా గాల్లోకి ఎగిరి అడ్డుకున్నాడు. దాంతో సిక్సర్ కాస్త సింగిల్‌గా మారింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'ఒరెయ్ జాక్స్.. నువ్వు మనిషివా..? పక్షివా? పాపం బుడ్డోడు'అని కామెంట్ చేస్తున్నారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ మూడో బంతిని లాఫ్టెడ్ డ్రైవ్‌తో భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్‌పై విల్ జాక్స్ అద్భుతంగా అడ్డుకున్నాడు. తన సూపర్ ఫీల్డింగ్‌తో 5 పరుగులను సేవ్ చేశాడు. ఈ సిక్సర్ సింగిల్‌గా మారడంతో వైభవ్ సూర్యవంశీ ఒత్తిడికి లోనయ్యాడు. వైభవ్‌కు స్ట్రైక్ ఎక్కువ రాకపోగా.. ఎదుర్కొన్న బంతులను బౌండరీకి తరలించలేకపోయాడు. చివరకు దీపక్ చాహర్ బౌలింగ్‌లోనే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
వైభవ్ సూర్యవంశీ(4)తో పాటు యశస్వి జైస్వాల్(27), కెప్టెన్ రియాన్ పరాగ్(14) నిరాశపర్చడంతో రాజస్థాన్ రాయల్స్ 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన డసన్ షనక(29)తో ధ్రువ్ జురెల్(38) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే అనవసర పరుగుకు ప్రయత్నించి ఈ జోడీ మూల్యం చెల్లించుకుంది.
డసన్ షనక రనౌట్‌గా వెనుదిరిగడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ధ్రువ్ జురెల్(38), ఫెరిరా(18) కూడా ఔటవ్వడంతో రాజస్థాన్ మూమెంటమ్ కోల్పోయింది. కానీ జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా దూకుడుగా ఆడి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది.
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దాంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మే 27న ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications