IPL 2026 క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు మరో అవకాశం ఎందుకంటే..?
ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరింది. మరికాసేపట్లో క్వాలిఫయర్-1 మ్యాచ్ ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) పోటీ పడుతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభమయ్యే తొలి క్వాలిఫైయర్ విజేత నేరుగా అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభించనుంది. అయితే ఇలా నాకౌట్ దశలో ఓడిన జట్టుకు మరో అవకాశం దక్కడం వెనుక ఉన్న కారణం గురించి తెలుసుకుందాం.
2011 నుంచే..
ఐపీఎల్ ఆరంభంలో టాప్-4లో నిలిచిన జట్ల మధ్య సెమీఫైనల్స్ జరిగేవి. టాప్ టీమ్, టాప్-4 జట్టు మధ్య తొలి సెమీఫైనల్, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరిగేది. సెమీఫైనల్లో గెలిచే జట్లు ఫైనల్లో తలపడేవి. అయితే ఈ విధానం వల్ల టాప్-2 టీమ్స్ విజయాలకు తగిన గుర్తింపు లభించడం లేదని భావించిన నిర్వాహకులు.. ప్లే ఆఫ్స్ ఫార్మాట్‌ను తీసుకొచ్చారు.
2011 నుంచి ఈ ఫార్మాట్ అమల్లోకి వచ్చింది. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లకు మరో అవకాశం ఉండేలా ఈ ఫార్మాట్ రూపొందించారు. దాంతోనే క్వాలిఫయర్-1 ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం లభించింది. ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సరైన నిర్ణయమేనని మద్దతు ఇస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు.

ఒకే ఒక్కసారి..
టాప్-2 టీమ్స్‌కు మరో అవకాశం లభిస్తున్నా..మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లకు మాత్రం ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1 టీమ్‌తో ఫైనల్ ఆడుతుంది. అంటే మూడు, నాలుగు స్థానాల్లో గెలిచిన టీమ్స్ టైటిల్ గెలవాలంటే వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాలి. టాప్-2లో నిలిచిన టీమ్స్ రెండు గెలిస్తే సరిపోతుంది.
అయితే ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి టాప్-2 టీమ్స్ టైటిల్ గెలిచాయి. ఒకే ఒక్కసారి ఎలిమినేటర్ ఆడిన జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. అది కూడా 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ రికార్డ్ విజయాన్ని అందుకుంది. మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్ చేయాలనే లక్ష్యంతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications