IPL 2026: హార్దిక్ కాదు.. ముంబైని ముంచింది రోహిత్ శర్మనే!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అనూహ్యంగా తడబడింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ముంబై టీమ్.. అందుకు తగ్గట్లునే శుభారంభం చేసింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. దాంతో ముంబైకి తిరుగు లేదని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది.
తిలక్ వర్మ అద్భుత శకతంతో ఒక మ్యాచ్ గెలిచినా.. మళ్లీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. అద్భుతం జరిగితే తప్పా ముంబై ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెత్త నిర్ణయాలు ముంబై పరాజయాలకు ప్రధాన కారణమని ఆ జట్టు అభిమానులు నిందిస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ చేయడం రావడం లేదని, సూర్యకు సారథ్య బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బుమ్రా, సూర్య, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్ వైఫల్యం కూడా ముంబై పతనాన్ని శాసించింది.

అయితే హార్దిక్ పాండ్యా కంటే రోహిత్ శర్మ గైర్హాజరే ముంబై పతనానికి ప్రధాన కారణమైంది. ఆర్‌సీబీతో జరిగిన తమ నాలుగో మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతని గాయం ఆ మ్యాచ్‌లో ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ గాయం కారణంగా రోహిత్ 5 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో ముంబై ఒకే ఒక్క విజయం సాధించింది. అది కూడా తిలక్ వర్మ శతకం పుణ్యమా అని గెలిచింది. లక్నోతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వడంతో ముంబై మళ్లీ విజయాల బాట పట్టింది. రోహిత్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేకేఆర్‌తో తొలి మ్యాచ్‌లో కూడా రోహిత్ అదరగొట్టాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35, రాజస్థాన్ రాయల్స్ 5, ఆర్‌సీబీతో 19 రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో ముంబై ఓటమిపాలైంది. రోహిత్ రాణించిన ప్రతీసారి ముంబై విజయం సాధించింది. ఈ గణంకాలనే చూపిస్తూ.. హార్దిక్ పాండ్యా కంటే రోహిత్ శర్మ గైర్హాజరీ వల్లే ముంబైకి నష్టం జరిగిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications