Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నో రిజర్వ్‌ డే.. SRH vs RR ఎలిమినేటర్ రద్దయితే..?

ఐపీఎల్ 2026 సీజన్‌ తుది దశకు చేరింది. మరో నాలుగు మ్యాచ్‌లతో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. మరికాసేపట్లో ప్లే ఆఫ్స్ సమరానికి తెరలేవనుండగా.. మంగళవారం న్యూఛండీఘర్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఐపీఎల్‌‌లో ఫైనల్ మ్యాచ్ మినహా మరే గేమ్‌కు రిజర్వ్‌డే లేదు. ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లకు కూడా రిజర్వ్ డే కేటాయించలేదు.

దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? అనే సందేహం అభిమానులను వెంటాడుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేదానిపై ఐపీఎల్‌లో స్పష్టమైన రూల్స్ ఉన్నాయి.

RCB vs GT: క్వాలిఫైయర్ మ్యాచ్‌ రద్ధు?

RCB vs GT: క్వాలిఫైయర్ మ్యాచ్‌ రద్ధు?

ఎలిమినేటర్ రద్దయితే..?

ఒక వేళ వర్షం లేదా మరే ఇతర కారణంగానైనా ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ముందడుగు వేస్తోంది. ఈ లెక్కన పాయింట్స్ టేబుల్‌లో రాజస్థాన్ రాయల్స్ కంటే ముందు స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తోంది.

IPL 2026 What Happens If SRH vs RR Eliminator Match Is Abandoned Due to Rain

లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో టాప్-3లో నిలిచింది. అగ్రస్థానంలో నిలిచిన ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో సమంగా SRH కూడా 18 పాయింట్స్ సాధించినా.. పేలవ రన్‌రేట్‌తో మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే రాజస్థాన్ రాయల్స్ కంటే ముందున్న సన్‌రైజర్స్ టోర్నీలో ముందడుగు వేస్తోంది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు.

క్వాలిఫయర్ మ్యాచ్‌లకు కూడా..

క్వాలిఫయర్-1 ఆడుతున్న ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌కు కూడా ఇదే రూల్ వర్తిస్తోంది. వర్షం కారణంగా క్వాలిఫయర్-1 రద్దయితే పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఆర్‌సీబీ ఫైనల్ చేరుతోంది. గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది.

క్వాలిఫయర్-2 కూడా వర్షంతో రద్దయితే.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్ చేరుకుంటుంది. ఈ లెక్కన మాత్రం క్వాలిఫయర్-1 ఓడిపోయిన జట్టు ఫైనల్ చేరుతుంది.

ఫైనల్ రద్దయితే..?

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్ డే ఉంది. మే 31న మ్యాచ్ సాధ్యం కాకపోయినా ఆటకు అంతరాయం కలిగినా.. మరుసటి రోజు(జూన్ 1) ఆడిస్తారు. కటాఫ్ సమయంలోపు కనీసం 5 ఓవర్ల ఆట సాధ్యంకాకపోతేనే రిజర్వ్‌డే నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.

SRH Playing XI: వ్యూహాత్మక మార్పు.. RRతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!

SRH Playing XI: వ్యూహాత్మక మార్పు.. RRతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!
Story first published: Tuesday, May 26, 2026, 15:52 [IST]
Other articles published on May 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+